DON 3 : మరోసారి డాన్ సీక్వెల్ చర్చలు.. షారుఖ్ తో అమితాబ్.. బాలీవుడ్ లో హైప్..
2006 లో డాన్ , 2011లో డాన్ 2తో సూపర్ హిట్స్ కొట్టిన షారూఖ్ కెరీర్లో డాన్ 3 గురించి చర్చ ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. డాన్ 2 తర్వాత డాన్ 3 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు డాన్ ప్రొడ్యూసర్ రితేష్ సిద్వానీ.

Shahrukh Khan and Amitabh Bachchan combo in DON 3 Movie
Shahrukh Khan : బాలీవుడ్(Bollywood) లో సెన్సేషన్ క్రియేట్ చేసిన కల్ట్ క్లాసిక్ డాన్(Don) మూవీ. ఈ సినిమా సెట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. అమితాబ్(Amitabh Bachchan) ని యాంగ్రీ మెన్ గా సరికొత్తగా పరిచయం చేసి ప్రేక్షకుల్ని ఫిదా చేసిన ఈ సినిమా దాదాపు 45 ఏళ్లవుతున్నా ఆ టైటిల్ కి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అమితాబ్ డాన్ మూవీని షారూఖ్ ఖాన్ అంతే స్టైలిష్ గా ప్యాషనేట్ గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అప్పటి నుంచి డాన్ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు.
2006 లో డాన్ , 2011లో డాన్ 2తో సూపర్ హిట్స్ కొట్టిన షారూఖ్ కెరీర్లో డాన్ 3 గురించి చర్చ ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. డాన్ 2 తర్వాత డాన్ 3 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు డాన్ ప్రొడ్యూసర్ రితేష్ సిద్వానీ. డాన్ 3 కోసం ఆల్రెడీ స్టోరీ ఫైనల్ చేస్తున్నారని, డాన్ 2 కి మించి ఇంట్రస్టింగ్ గా ఫర్హాన్ అక్తర్ స్టోరీ రాస్తున్నారని చెబుతున్నారు రితేష్. ఇప్పుడు రితేష్ హింట్ ఇవ్వడంతో డాన్ 3 సెట్స్ మీదకెప్పుడెళుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫాన్స్.
డాన్ 3కి సంబందించి ఫర్హాన్ అక్తర్ గతంలో స్టోరీ ప్రిపేర్ చేస్తే అంతగా కన్విన్స్ కాని షారూఖ్ రీరైట్ చెయ్యమని సలహా ఇవ్వడంతో ఈ సారి మరింత స్ట్రాంగ్ లైన్ తో స్టోరీ రెడీ చేస్తున్నారు ఫర్హాన్. అయితే ఈసారి డాన్ 3 లో షారూఖ్ తో పాటు ఒరిజినల్ డాన్ అమితాబ్ బచ్చన్ కూడా కనిపించబోతున్నారని టాక్. ఇద్దరు డాన్ హీరోల్ని కలిపి స్క్రీన్ మీద చూపిస్తే అది బాలీవుడ్ బిగ్గెస్ట్ కలెక్షన్ మూవీ అవుతుందంటూ ఇప్పటి నుంచే హైప్ చేస్తున్నారు. డాన్ 3 సినిమాలో అమితాబ్ ఓ గెస్ట్ రోల్ చేయనున్నారని, ఇందుకు అమితాబ్ కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. దీంతో డాన్ 3 సినిమాపై ఇప్పట్నుంచే బాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Amitabh Bachchan : ట్రాఫిక్ వల్ల షూటింగ్ కి లేట్ అవుతుందని.. లిఫ్ట్ అడిగి బైక్ మీద వెళ్లిన అమితాబ్..
ఇటీవలే పఠాన్ సినిమాతో భారీ హిట్ కొట్టి జవాన్, ఢంకి.. లాంటి సినిమాలను లైన్ లో పెట్టిన షారుఖ్ ఆ తర్వాత డాన్ 3 సినిమాలో నటిస్తారని సమాచారం. ఇక వీటి మధ్య టైగర్ 3 సినిమాలో కూడా షారుఖ్ గెస్ట్ అప్పీరెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఇన్నాళ్లు ఫ్లాప్స్ లో ఉన్న షారుఖ్ పఠాన్ నుంచి మాత్రం చాలా పకడ్బందీగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు.