Shahrukh Khan : సొంత రికార్డునే బద్దలు కొట్టిన షారుఖ్.. పఠాన్ లైఫ్ టైం కలెక్షన్స్ ని దాటేసిన జవాన్..
ఒక సినిమాతోనే భారీ హిట్ కొట్టి బాలీవుడ్ లో ఏ సినిమాలు సెట్ చేయలేని సరికొత్త రికార్డులు సెట్ చేసాడు అనుకుంటే మళ్ళీ ఇంకో సినిమాతో వచ్చి తన సినిమా రికార్డులని తానే బద్దలు కొట్టి మరోసారి బాలీవుడ్ కా బాద్షా అని ప్రూవ్ చేసుకున్నాడు షారుఖ్.

Shahrukh Khan Jawan Movie Cross Pathaan Movie Life Time Collections Creates new Record in Bollywood
Shahrukh Khan : దాదాపు ఏడేళ్లుగా హిట్స్ లేవు. సినిమాలకు గ్యాప్ ఇచ్చి అయిదేళ్ళు అయింది. 2023 ముందు షారుఖ్ ఖాన్ పరిస్థితి ఇది. బాలీవుడ్ బాద్షా పని అయిపోయింది అన్నారు. కానీ షారుఖ్ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు 2023 లో. ఒక సినిమాతోనే భారీ హిట్ కొట్టి బాలీవుడ్ లో ఏ సినిమాలు సెట్ చేయలేని సరికొత్త రికార్డులు సెట్ చేసాడు అనుకుంటే మళ్ళీ ఇంకో సినిమాతో వచ్చి తన సినిమా రికార్డులని తానే బద్దలు కొట్టి మరోసారి బాలీవుడ్ కా బాద్షా అని ప్రూవ్ చేసుకున్నాడు షారుఖ్.
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా సిద్దార్థ్ ఆనంద దర్శకత్వంలో ఈ సంవత్సరం జనవరిలో వచ్చిన పఠాన్ సినిమా భారీ విజయం సాధించింది. దాదాపు 50 రోజులు థియేటర్స్ లో ఆడి పఠాన్ సినిమా లాంగ్ రన్ లో 1053 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి షారుఖ్ కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్స్ చూస్తున్న బాలీవుడ్ కి కూడా హిట్ సినిమా ఇచ్చి బాలీవుడ్ లో జోష్ నింపాడు.
#Pathaan celebrations continue to win hearts all over ???
Book your tickets now – https://t.co/SD17p6x9HI | https://t.co/VkhFng6vBjCelebrate #Pathaan with #YRF50 only at a big screen near you, in Hindi, Tamil and Telugu. pic.twitter.com/V8nD5JMdYu
— Yash Raj Films (@yrf) April 1, 2023
ఇక ఇటీవల షారుఖ్ ఖాన్(Shahrukh Khan) సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు జవాన్(Jawan) సినిమాతో వచ్చి భారీ విజయం సాధించారు. తమిళ్ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో నయనతార, దీపికా పదుకొనే, ప్రియమణి, విజయ్ సేతుపతి.. లాంటి పలువురు స్టార్స్ ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా రిలీజ్ అయి నెల రోజులు కూడా కాకుండానే ఇటీవలే 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాగా తాజాగా ఇప్పటివరకు జవాన్ సినిమాకు ఏకంగా 1068 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు ప్రకటించారు. దీంతో జవాన్ సినిమా అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన హిందీ సినిమాగా నిలిచింది.
దీంతో పఠాన్ సినిమా లైఫ్ టైం కలెక్షన్స్ 1053 కోట్లని జవాన్ సినిమా కేవలం 24 రోజుల్లోనే దాటేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. షారుఖ్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అభిమానులు, పలువురు నెటిజన్లు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా షారుఖ్ కి, చిత్రయూనిట్ కి అభినందనలు తెలుపుతున్నారు. ఇక ఈ ఇయర్ ఎండింగ్ కి షారుఖ్ డుంకి సినిమాతో రాబోతున్నారు. మరి ఈ సినిమా కూడా 1000 కోట్లు కలెక్ట్ చేసి హ్యాట్రిక్ హిట్ కొడుతుందా చూడాలి.