Shilpa Shetty : చెప్పులేసుకుని జెండా ఎగర‌వేసిన హీరోయిన్‌.. కామన్​సెన్స్​ లేదా అంటూ ట్రోల్స్‌.. రూల్స్ నాకు తెలుసంటూ కౌంట‌ర్‌

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆమె హిందీతో పాటు తెలుగులోనూ ప‌లు చిత్రాల్లో న‌టించింది.

Shilpa Shetty : చెప్పులేసుకుని జెండా ఎగర‌వేసిన హీరోయిన్‌.. కామన్​సెన్స్​ లేదా అంటూ ట్రోల్స్‌.. రూల్స్ నాకు తెలుసంటూ కౌంట‌ర్‌

Shilpa Shetty

Updated On : August 16, 2023 / 6:54 PM IST

Shilpa Shetty : బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆమె హిందీతో పాటు తెలుగులోనూ ప‌లు చిత్రాల్లో న‌టించింది. ‘సాహసవీరుడు – సాగరకన్య’, ‘వీడెవ‌డండీ బాబు’ సినిమాల‌తో టాలీవుడ్ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెద‌ర‌ని ముద్ర వేసింది. ఇక ఇమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. త‌న ఫిట్నెస్, యోగాకు సంబంధించిన వీడియోల‌ను అభిమానుల‌తో పంచుకుంటుంది.

77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని (Independence Day) దేశవ్యాప్తంగా మంగళవారం ఘ‌నంగా జ‌రుపుకున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఇళ్ల వ‌ద్ద ప్ర‌జ‌లు జెండా ఎగ‌ర‌వేశారు. ఈ క్ర‌మంలో బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి సైతం ముంబైలోని జుహూలోని త‌న ఇంటి వ‌ద్ద కుటుంబ సభ్యుల‌తో క‌లిసి జెండా ఎగ‌ర‌వేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

Vishwak – Neha : నిన్న విజయ్, సమంత.. నేడు విశ్వక్, నేహశెట్టి.. ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్..

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)

ఈ వీడియోలో ఆమె జెండా ఎగ‌ర‌వేస్తున్న స‌మ‌యంలో ఆమె కాలికి చెప్పులు వేసుకుని క‌నిపించింది. దీనిపై కొంద‌రు నెటీజ‌న్లు మండిప‌డ్డారు. కొంచెం అన్నా కామ‌న్ సెన్స్ ఉండాలి..? చెప్పులేసుకుని జెండా ఎగ‌ర‌వేస్తారా..? అంటూ ట్రోల్స్ చేశారు. మ‌రికొంద‌రు మాత్రం న‌టికి మ‌ద్ద‌తుగా మాట్లాడారు. కాగా.. ఈ ట్రోల్స్‌పై శిల్పా శెట్టి కాస్త ఘ‌ట్టిగానే స్పందించింది.

Gangs of Godavari : గ్యాంగ్స్ అఫ్ గోదావరి ఫస్ట్ సింగల్ రిలీజ్.. సుట్టంలా సూసి పోకల..

జాతీయ జెండాను ఎగ‌ర‌వేసే స‌మ‌యంలో పాటించాల్సిన నిబంధ‌న‌ల‌పై త‌న‌కు స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉన్న‌ట్లు తెలిపింది. అంతేకాదు చెప్పులేసుకోకూడ‌నే రూల్ ఎక్క‌డా లేద‌ని చెప్పుకొచ్చింది. గూగుల్‌లో ఓ ఆర్టిక‌ల్‌ను వెతికి మరీ షేర్ చేసింది. ఇప్ప‌టికైనా వాస్త‌వాలు తెలుసుకోవాలంటూ కాస్త గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చింది.

Samantha : ‘చిన్మయి పాపా.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా..’ స‌మంత‌

Shilpa Shetty tweet

Shilpa Shetty tweet