Ghost Trailer : ‘ఘోస్ట్’ ట్రైలర్.. నేను వెళ్తే రణరంగం మారణహోమంగా మారుతుంది.. శివన్న యాక్షన్ ఫీస్ట్..

ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టి శివన్న ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ఘోస్ట్ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు.

Ghost Trailer : ‘ఘోస్ట్’ ట్రైలర్.. నేను వెళ్తే రణరంగం మారణహోమంగా మారుతుంది.. శివన్న యాక్షన్ ఫీస్ట్..

Shiva Rajkumar Ghost Movie Trailer Released Telugu Trailer Released by Rajamouli

Updated On : October 1, 2023 / 11:46 AM IST

Ghost Trailer : కన్నడ స్టార్ హీరో డా. శివరాజ్ కుమార్(Shiva Rajkumar) హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతోన్న చిత్రం ‘ఘోస్ట్’. దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రాన్ని యాక్షన్ ఫీస్ట్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 19న దసరా కానుకగా కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో విడుదలకి సిద్ధమవుతుంది.

ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టి శివన్న ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ఘోస్ట్ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో.. యుద్ధం మానవ ప్రపంచానికి ఒక మాయని గాయం. ఇలాంటి యుద్ధాల వల్ల సామ్రాజ్య స్థాపన కంటే కూడా అవి చేసిన నష్టాలే ఎక్కువ. సామ్రాజ్యాన్ని నిర్మించిన వాడిని చరిత్ర మర్చిపోవచ్చు. కానీ విధ్వంసం సృష్టించే నాలాంటి వాళ్ళని మాత్రం ఎప్పటికి మర్చిపోదు అనే పవర్ ఫుల్ డైలాగ్స్ తో శివన్న ఎంట్రీ ఇచ్చి ఫుల్ మాస్, యాక్షన్ సీన్స్ ని చూపించారు. జైలులో ఖైదీలతో ఫైట్ సీక్వెన్స్ చూపించారు. చివర్లో శివన్న యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలాగే చూపించి ఆశ్చర్యపరిచారు. ఇక చివర్లో నేను వెళ్తే రణరంగం మారణహోమంగా మారుతుంది అనే పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి అదరగొట్టారు.

Also Read : TFAPA : సినీ పరిశ్రమ కోసం ఇవన్నీ చేయండి.. తమిళనాడు ప్రభుత్వానికి సినీ నిర్మాతల రిక్వెస్ట్..

ఘోస్ట్ సినిమాలో అనుపమ్ ఖేర్, జయరాం.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఘోస్ట్ తెలుగు ట్రైలర్ ని దర్శక ధీరుడు రాజమౌళి లాంచ్ చేశారు. ట్విట్టర్ లో షేర్ చేస్తూ చిత్రయూనిట్ కి అల్ ది బెస్ట్ చెప్పారు. ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. దీంతో అభిమానులు శివరాజ్ కుమార్ ఘోస్ట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.