Shraddha Kapoor : ప్రియుడితో సాహో బ్యూటీ బ్రేకప్??

'సాహో' సినిమాతో తెలుగువాళ్ళకు పరిచయమైన బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ శ్రద్దా కపూర్‌ ఇటీవల తన ప్రియుడికి బ్రేకప్‌ చెప్పిందని బాలీవుడ్ మీడియా అంటుంది. బాలీవుడ్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్‌...

Shraddha Kapoor : ప్రియుడితో సాహో బ్యూటీ బ్రేకప్??

Shraddha

Updated On : March 26, 2022 / 8:26 AM IST

 

Shraddha Kapoor :  సినీ పరిశ్రమలో ఉండే రిలేషన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల అన్ని సినీ పరిశ్రమలలోనూ విడాకులు, బ్రేకప్‌లు పెరిగిపోతున్నాయి. పెళ్లి చేసుకున్న వాళ్ళే విడాకులు తీసుకుంటున్నారు. ఇక లవ్‌లో ఉన్న వాళ్ళు బ్రేకప్ చెప్పుకుంటే ఆశ్చర్యపోనవసరం లేదు. బాలీవుడ్‌లో అయితే లవ్, బ్రేకప్‌లు చాలా మామూలు విషయం. తాజాగా బాలీవుడ్‌లో మరో ప్రేమ జంట బ్రేకప్ చెప్పుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది.

‘సాహో’ సినిమాతో తెలుగువాళ్ళకు పరిచయమైన బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ శ్రద్దా కపూర్‌ ఇటీవల తన ప్రియుడికి బ్రేకప్‌ చెప్పిందని బాలీవుడ్ మీడియా అంటుంది. బాలీవుడ్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్‌ రోషన్‌ శ్రేష్టతో శ్రద్దా గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. పార్టీలు, పబ్‌లు, టూర్స్‌ అంటూ ఎంజాయ్ చేస్తూ ఈ జంట చాలా సార్లు మీడియాకు చిక్కారు. అయితే అనూహ్యంగా వీరి లవ్‌స్టోరీకి ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు అంటున్నారు. వీరిద్దరూ విడిపోవడానికి కారణాలు ఏంటి అన్నది మాత్రం ఇంకా తెలియదు.

RRR : మాస్టర్ పీస్ అంటూ ‘ఆర్ఆర్ఆర్’పై మెగాస్టార్ ట్వీట్

 

గత కొన్ని రోజులుగా శ్రద్దా, రోషన్ మాట్లాడుకోవట్లేదట, అంతే కాక ఎక్కడా కలుసుకోవట్లేదు కూడా. దీంతో వీరిద్దరూ విడిపోయారని అంటున్నారు బాలీవుడ్ సినీ వర్గాలు. ఇక ఇటీవలే గోవాలో శ్రద్దాకపూర్‌ బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకి తన ఫ్రెండ్స్, సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది హాజరయ్యారు. కానీ తన బాయ్ ఫ్రెండ్ రోషన్ మాత్రం హాజరవ్వలేదు. అంతే కాక కనీసం సోషల్ మీడియాలో రోహాన్‌ బర్త్‌డే విషెస్‌ పోస్ట్ కూడా పెట్టలేదు. దీంతో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని ప్రస్తతం బాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై శ్రద్దా, రోషన్ ఇప్పటివరకు స్పందించకపోవడం విశేషం.