Armaan Malik : యూట్యూబర్ పై ఫైర్ అయిన బుట్టబొమ్మ సింగర్..

సందీప్ అనే ఓ వ్యక్తి అర్మాన్ మాలిక్ పేరుతో సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తున్నాడు. ఫేమ్ కోసం ఇతను ఏకంగా అన్ని చోట్ల అతని పేరుని అర్మాన్ మాలిక్ అని మార్చుకొని సింగర్ అర్మాన్ మాలిక్ గురించి వెతికినా ఇతని గురించి వచ్చేటట్టు ప్రమోట్ చేసుకుంటున్నాడు...............

Armaan Malik : యూట్యూబర్ పై ఫైర్ అయిన బుట్టబొమ్మ సింగర్..

Singer Armaan Malik fires on youtuber sandeep alias arman malik for misusing his name armaan malik

Updated On : February 27, 2023 / 10:49 AM IST

Armaan Malik :  బాలీవుడ్ స్టార్ సింగర్ అర్మాన్ మాలిక్ తెలుగులో కూడా చాలా సాంగ్స్ పాడాడు. అలవైకుంఠపురంలో సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ బుట్టబొమ్మ కూడా ఇతనే పాడి ప్రేక్షకులందర్నీ మెప్పించాడు. తాజాగా అర్మాన్ మాలిక్ ఓ యూట్యూబర్ పై ట్విట్టర్ లో ఫైర్ అయ్యాడు.

సందీప్ అనే ఓ వ్యక్తి అర్మాన్ మాలిక్ పేరుతో సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తున్నాడు. ఫేమ్ కోసం ఇతను ఏకంగా అన్ని చోట్ల అతని పేరుని అర్మాన్ మాలిక్ అని మార్చుకొని సింగర్ అర్మాన్ మాలిక్ గురించి వెతికినా ఇతని గురించి వచ్చేటట్టు ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు ఉండటం విశేషం. ఇతను, తన ఇద్దరి భార్యలతో కలిసి వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో అర్మాన్ మాలిక్ అనే ఛానల్ తో వైరల్ అవుతూ ఉంటాడు. ఇటీవలే ఇతని ఇద్దరు భార్యలు కూడా ప్రెగ్నెంట్ అయ్యారు. అయితే తాజాగా తన ఇద్దరి భార్యలను కొట్టి ప్రాంక్ అంటూ వీడియో చేశాడు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో అర్మాన్ మాలిక్ ప్రెగ్నెంట్ లేడిని కొట్టాడు అంటూ వార్త వైరల్ అయింది. ఇతని గురించి తెలియని కొంతమంది సింగర్ అర్మాన్ మాలిక్ ఈ పని చేసాడేమో అని సోషల్ మీడియాలో అతన్ని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు.

ఇలాంటి ఘటనలు ఈ ఫేక్ అర్మాన్ మాలిక్ వల్ల గతంలో కూడా ఎదుర్కున్నాడు సింగర్ అర్మాన్ మాలిక్. ఈ ఘటనతో అర్మాన్ మాలిక్ కి చాలా చెడ్డ పేరు రావడంతో ఈ వివాదంపై ట్విట్టర్ లో స్పందించాడు. సింగర్ అర్మాన్ మాలిక్ తన ట్విట్టర్ లో.. ఇతన్ని అర్మాన్ మాలిక్ అని పిలవడం ఆపండి. ఇతని పేరు సందీప్. ఇలాంటి పిచ్చి వీడియోలు చేసి నా పేరుని చెడగొడుతున్నాడు. పొద్దున్నే లేవగానే ఈ న్యూస్ లు చూస్తున్నాను. ఇతను చేసే పనులకు, నా మీద రాసే వార్తలని చూసి చిరాకు వస్తుంది అంటూ సీరియస్ గా పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ కాగా అర్మాన్ మాలిక్ అభిమానులు ఆ ఫేక్ అర్మాన్ మాలిక్ ని విమర్శిస్తూ పోస్టులు, కామెంట్స్ చేస్తున్నారు.

Ram Charan-Venkatesh : అమెరికా పెళ్ళిలో చరణ్-వెంకీ మామ సందడి.. వెంకీ మామ చరణ్ గురించి ఏమన్నాడో తెలుసా?

అయితే అర్మాన్ మాలిక్ పెట్టిన పోస్ట్ కి సందీప్ మరో వీడియో చేశాడు.. అర్మాన్ మాలిక్ అనే పేరు నీ ఒక్కడికే ఉండాలా? వేరే వాళ్ళకి ఉండకూడదా? నీకంటే బాలీవుడ్ లో మంచి బ్యాక్ గ్రౌండ్ ఉంది. నాకేం లేదు. అందుకే ఇలా వీడియోలు చేసుకుంటూ పాపులర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను అని అన్నాడు. దీంతో అర్మాన్ మాలిక్ అభిమానులు నువ్వు పాపులర్ అవ్వాలనుకుంటే నీ సొంత పేరుతో అవ్వు, వేరే వాళ్ళ పేరుని వాడుకొని కాదు అంటూ సీరియస్ గా కామెంట్స్ చేస్తున్నారు.