Lata Mangeshkar : లతా మంగేష్కర్ హెల్త్.. వదంతులు నమ్మవద్దు
ఆమె ఆరోగ్యంపై సోషల్‌మీడియాలో అనేక పుకార్లు వ్యాపిస్తున్నాయి. దీంతో లతామంగేష్కర్ మేనేజ్ మెంట్ బృందం అభిమానుల కోసం ఓ ప్రకటన విడుదల చేసింది. లత ఆరోగ్యంపై వస్తున్న ఎలాంటి వదంతులనూ...

Lata
Singer Lata Mangeshkar Health : ప్రముఖ గాయని లతామంగేష్కర్‌కు కరోనా చికిత్స కొనసాగుతోంది. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. 92 ఏళ్ల లతామంగేష్కర్ కరోనాతో ఈ నెల 8న ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆమెకు ఐసీయూ(ICU) లో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఆమె ఆరోగ్యంపై సోషల్‌మీడియాలో అనేక పుకార్లు వ్యాపిస్తున్నాయి. దీంతో లతామంగేష్కర్ మేనేజ్ మెంట్ బృందం అభిమానుల కోసం ఓ ప్రకటన విడుదల చేసింది. లత ఆరోగ్యంపై వస్తున్న ఎలాంటి వదంతులనూ నమ్మవద్దని కోరారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని విజ్ఞప్తి చేశారు.
Read More : India-Germany: భారత పర్యటనకు వచ్చి చైనా పై నిప్పులు చెరిగిన జర్మన్ అధికారి
ఆస్పత్రిలో చేరిన నాటికి, ఇప్పటికీ ఆమె ఆరోగ్యం మెరుగైందని, ఘనాహారం తీసుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందడం లేదని, రెండు, మూడురోజులుగా బాగా కోలుకున్నారని చెప్పారు. లతా మంగేష్కర్ కరోనాతో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమె ఆరోగ్యంపై అనేక పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఆమె ఆరోగ్యం క్షీణించిందని ప్రచారం జరిగింది. దీనితో ఆమె ప్రతినిధులు ఆ వార్తలు ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. జనవరి 08వ తేదీన లతా మంగేష్కర్ కు కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో…బ్రీచ్ కాండీ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్య నిపుణుల బృందం ఆమె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఆమె త్వరగా కోలుకోవాలని పోస్టులు చేస్తున్నారు. లతా మంగేష్కర్ ఎన్నో పాటలు పాడి…అవార్డులు పొందారు. 2001లో దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న అవార్డు ఆమెను వరించింది. పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే వంటి ఉన్నతమైన అవార్డ్స్ వరించాయి.
Read More : Gudivada Casino : కాసినో.. పెట్రోల్.. కొడాలి నాని సవాల్‌ను స్వీకరించిన నేతలు
మరోవైపు….దేశంలో థర్డ్‌వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10వేలు దాటింది. కొత్త వేరియంట్ కేసులు అన్ని రాష్ట్రాల్లోనూ కలిపి 10 వేల50 నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే 3.29శాతం పెరిగాయి. అయితే ముందురోజుతో పోలిస్తే మాత్రం గడచిన 24 గంటల్లో నమోదయిన కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. ఒక్కరోజులో 3 లక్షల 37 వేల కేసులు నమోదయ్యాయి. మొన్న 3 లక్షల 88వేల కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు ముందురోజు 17.94శాతంగా ఉంటే కాస్త తగ్గింది ప్రస్తుతం పాజిటివిటీ రేటు 17.22శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 5.43శాతంగా ఉంది. థర్డ్‌వేవ్‌లో కరోనా రికవరీ రేటు తగ్గుతూ వస్తోంది. ఒక్కరోజులో 93.31 శాతానికి పడిపోయింది. గడచిన 24 గంటల్లో 488 మంది కరోనా బారిన పడి చనిపోయారు. థర్డ్‌వేవ్‌లో ఒక్కరోజులో ఇన్ని కరోనా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి.