SJ Suryah: చరణ్ సినిమాలో తన పాత్రను లీక్ చేసిన సూర్య!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా చరణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా తెరకెక్కుతుండగా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండబోతున్నట్లు ప్రారంభోత్సవ సమయంలోనే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

SJ Suryah Gives Solid Update About RC15
SJ Suryah: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా చరణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా తెరకెక్కుతుండగా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండబోతున్నట్లు ప్రారంభోత్సవ సమయంలోనే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
Ram Charan Shankar Movie: చరణ్ సినిమాలో మరో స్టార్ యాక్టర్.. ఎవరంటే?
ఇక తాజాగా ఈ సినిమాలో తమిళ వర్సటైల్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్.జె.సూర్య ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమాలో ఎస్.జె.సూర్య ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ సినిమాలో సూర్య తన పాత్ర ఏమిటనేది తాజాగా లీక్ చేశారు. శంకర్ డైరెక్టర్‌గా తెరకెక్కిన ‘స్నేహితుడు’ చిత్రంలో ఓ సైడ్ క్యారెక్టర్ పాత్రలో నటించిన తాను ఇప్పుడు ఇలా చరణ్ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తుండటం తనకు సంతోషంగా ఉందని సూర్య తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
RC15 First Look: ఫస్ట్ లుక్ కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్న శంకర్..?
దీంతో ఈ సినిమాలో ఆయన పాత్ర ఏమిటనేది రివీల్ అయిపోయింది. చరణ్ సినిమాలో సూర్య పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తుండగా, ఆయన పాత్ర ఈ సినిమాకు చాలా కీలకంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్నమైన లుక్స్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతుండగా, ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
#WOW dir @shankarshanmugh sir?? peeped his sets when I was junior artist , did a cameo in nanban, now as antagonist?- same command, more energy pulled the best from everyone?am continuously admiring & learning a lot fromU sir as a fan & as an actor in Ur set? #RC15 JUST KEKA
— S J Suryah (@iam_SJSuryah) September 11, 2022