Sonakshi Sinha : దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా అందానికి కారణం అదేనట.

సోనాక్షి సిన్హా మాట్లాడుతూ.. ''నా చిన్నప్పుడు మా అమ్మ తన మొహానికి అలోవెరా రాసుకోవడం చూసేదాన్ని ఆ ఆకు జిగురును అలా ఎందుకు రాసుకుంటుందో అప్పుడు అర్థం కాలేదు. జిగురుగా ఉంటుందని నేను రాసుకోను అని చెప్పేదాన్ని. కానీ సినిమాల్లోకి వచ్చాక................

Sonakshi Sinha : దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా అందానికి కారణం అదేనట.

Sonakshi Sinha reveals her beauty tip

Updated On : August 22, 2022 / 10:16 AM IST

Sonakshi Sinha :  దబాంగ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సోనాక్స్జి సిన్హా ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారింది. ఇటీవల కెరీర్ లో కొంచెం స్లో అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు అమ్మడికి. సినిమాల్లోకి రాకముందు బొద్దుగా ఉండే ఈ భామ సినిమాల్లోకి వస్తూ సన్నగా మారి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి సిన్హా మాట్లాడుతూ తన అందానికి సీక్రెట్ తెలిపింది.

#BoycottHrithik : మళ్ళీ బాయ్‌కాట్‌ జొమాటో, బాయ్‌కాట్‌ హృతిక్.. పాపం బాలీవుడ్..

సోనాక్షి సిన్హా మాట్లాడుతూ.. ”నా చిన్నప్పుడు మా అమ్మ తన మొహానికి అలోవెరా రాసుకోవడం చూసేదాన్ని ఆ ఆకు జిగురును అలా ఎందుకు రాసుకుంటుందో అప్పుడు అర్థం కాలేదు. జిగురుగా ఉంటుందని నేను రాసుకోను అని చెప్పేదాన్ని. కానీ సినిమాల్లోకి వచ్చాక అర్థమైంది. సినిమాల్లో హీరోయిన్ అంటే కచ్చితంగా అందంగా ఉండాలంటారు. అందుకే స్కిన్, ఫేస్ గ్లోయింగ్ ఉంచుకోవాలి. దీంతో నా బ్యూటీ సీక్రెట్ కూడా అదే అయింది. షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా రోజుకు రెండు సార్లు మొహానికి అలోవెరా రాసుకుంటాను. అప్లయ్‌ చేసుకున్నాక ఇరవై నిమిషాలకు చల్లటి నీళ్లతో మొహం కడుక్కుంటాను. రోజూ ఇలా చేయడం వల్లే నా ఫేస్ గ్లోయింగ్ గా ఉంటుంది. దీనివల్ల మొటిమలు, మచ్చలు, ట్యాన్, పిగ్మెంటేషన్‌.. లాటివి ఉండవు” అని చెప్పింది.