Sonal Chauhan : ప్రభాస్ తో నటించడమే నా డ్రీమ్.. ‘ఆదిపురుష్’లో సోనాల్ చౌహాన్..

సోనాల్ చౌహన్ మాట్లాడుతూ.. ''ప్రభాస్ తో నటించడం నా డ్రీమ్. ఒకరోజు సడెన్ గా ఆదిపురుష్ టీం నుంచి నాకు కాల్ వచ్చింది అందులో ఓ పాత్ర చేయమని అడగడంతో నేను షాక్ అయ్యాను. ప్రభాస్ తో నటించే నా కల...........

Sonal Chauhan : ప్రభాస్ తో నటించడమే నా డ్రీమ్.. ‘ఆదిపురుష్’లో సోనాల్ చౌహాన్..

Sonal Chauhan said that she acted in Adipurush with Prabhas

Updated On : September 18, 2022 / 12:57 PM IST

Sonal Chauhan :  రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. వరుసగా సినిమాలు లైన్లో ఉన్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత గా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా మొదలై రెండేళ్లు అవుతున్నా ఒక్క పోస్టర్ తప్ప సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు.

ఇప్పటికే షూటింగ్ అయిపోయిందని, పోస్ట్ ప్రొడక్షన్ లో ఉందని ఆదిపురుష్ చిత్ర యూనిట్ వెల్లడించింది. 2023 సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. సినిమా రిలీజ్ కి ఇంకా మూడు నెలలే ఉన్నా కనీసం సినిమాకి సంబంధించి ఒక్క పోస్టర్ కానీ, టీజర్ కానీ, గ్లింప్స్ కానీ రిలీజ్ చేయకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. దసరా పండగకి ఆదిపురుష్ సినిమా నుంచి టీజర్ రాబోతుందని వార్తలు వస్తున్నా చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.

Bellamkonda Ganesh : ఆ ఇద్దరు స్టార్ హీరోలని ఢీ కొడతా అంటున్న బెల్లంకొండ డెబ్యూ హీరో

తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది హీరోయిన్ సోనాల్ చౌహన్. తెలుగులో లెజెండ్, డిక్టేటర్ లాంటి సినిమాల్లో నటించిన సోనాల్ త్వరలో నాగార్జున సరసన ఘోస్ట్ సినిమాతో అలరించబోతుంది. తాజాగా బాలీవుడ్ లో ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన హీరోయిన్ సోనాల్ చౌహన్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆదిపురుష్ సినిమా గురించి మాట్లాడింది.

సోనాల్ చౌహన్ మాట్లాడుతూ.. ”ప్రభాస్ తో నటించడం నా డ్రీమ్. ఒకరోజు సడెన్ గా ఆదిపురుష్ టీం నుంచి నాకు కాల్ వచ్చింది అందులో ఓ పాత్ర చేయమని అడగడంతో నేను షాక్ అయ్యాను. ప్రభాస్ తో నటించే నా కల నెరవేరుతుంది అని భావించాను. ఆదిపురుష్ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక బాలీవుడ్ ఆదిపురుష్‌కు ముందు, ఆదిపురుష్ తరువాత అని అంటారు. ఇది అద్భుతమైన సినిమా” అంటూ తెలిపింది. ఈ సినిమాలో తాను నటిస్తున్నాను అని చెప్పడం, సినిమా గురించి పొగడటంతో ప్రభాస్ అభిమానులు సంతోషిస్తున్నారు.