South Cinema : సౌత్ ఇండియా ఎంటర్టైన్మెంట్ వేడుక.. తమిళ్ సీఎం సరసన ఒకే వేదికపై మణిరత్నం, రాజమౌళి, సుక్కు..

దక్షిణ్‌ అనే పేరుతో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు సత్యజ్యోతి ఫిలిమ్స్‌ అధినేత త్యాగరాజన్‌ అధ్యక్షత వహించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సౌత్ సినిమాకి సంబంధించిన అనేక మంది........

South Cinema : సౌత్ ఇండియా ఎంటర్టైన్మెంట్ వేడుక.. తమిళ్ సీఎం సరసన ఒకే వేదికపై మణిరత్నం, రాజమౌళి, సుక్కు..

Rajamouli

Updated On : April 11, 2022 / 7:38 AM IST

 

South Cinema :  ప్రస్తుతం సౌత్ సినిమాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని శాసిస్తున్నాయి. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుని పొందాయి. మన దగ్గర కూడా భారీ సినిమాలు నిర్మిస్తున్నారు, అంతకంటే భారీగా కలెక్షన్లు కూడా రాబడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే గత కొన్ని నెలలుగా దక్షిణాది సినీ పరిశ్రమ బాలీవుడ్ ని దాటేసి మరీ జెండా ఎగరవేస్తుంది. ఈ విషయంలో బాలీవుడ్ స్టార్ హీరోలు, డైరెక్టర్లు సైతం మన ఎదుగుదలని చూసి కుళ్ళుకుంటున్నారు.

తాజాగా దక్షిణ్ పేరుతో సౌత్‌ ఇండియా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ అనే కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది. దీనికి సౌత్ సినిమా నుంచి, మీడియా నుంచి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ విచ్చేశారు. ఈ సమ్మిట్ చెన్నైలోని నందంబాక్కం ట్రేడ్‌ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సినిమా గురించి, పలు అంశాల గురించి మాట్లాడారు.

సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ.. ” నేను కూడా ఒకప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాను. దక్షిణాది సినిమా ఇటివల దూసుకుపోతుంది. చిత్ర పరిశ్రమ ఐక్యతకు అన్ని సహాయ సహకారాలు నేను అందచేస్తాను. అయితే ఈతరం యువత గంజాయి, గుట్కా వంటి మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు, అలాంటి వాటిపై సినిమాల్లో అవగాహన కలిగించే విధంగా సంభాషణలు ఉండాలి” అని తెలిపారు.

Ankit Siwach : మాకు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. బట్టలు లేకుండా ఫోటోలు పంపమన్నారు..

ఇక దక్షిణ్‌ అనే పేరుతో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు సత్యజ్యోతి ఫిలిమ్స్‌ అధినేత త్యాగరాజన్‌ అధ్యక్షత వహించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సౌత్ సినిమాకి సంబంధించిన అనేక మంది ప్రముఖులు పాల్గొననున్నారు. మన తెలుగు నుంచి డైరెక్టర్స్ రాజమౌళి, సుకుమార్, తరుణ్ భాస్కర్ తో పాటు మరికొంతమంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకలో వేదికపై తమిళనాడు సీఎం, పలువురు ప్రముఖులు, డైరెక్టర్ మణిరత్నంతో పాటు స్టేజిపై రాజమౌళి, సుకుమార్ లకు కూడా స్థానం కల్పించారు. దీంతో తెలుగు ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Shivathmika : పారిపోయింది నేనా? మా అక్కా??.. ఫేక్ న్యూస్ పై ఫైర్ అయిన శివాత్మిక..

ఇక ఈ ఈవెంట్ లో రాజమౌళి, మణిరత్నం, సుకుమార్ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరితో పాటు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఫొటోలు దిగారు. మన తెలుగు సినిమాకి మంచి స్థానం కల్పించారు ఈ సదసస్సులో. ఈ సదస్సులో సినీ పరిశ్రమ అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, సినిమా మార్కెట్‌ విస్తరణ, ఓటీటీ ప్రభావంపై పలువురు సినీ ప్రముఖులు మాట్లాడారు.