ఆసుపత్రిలోనే 51వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న ఎస్పీ బాలు దంపతులు

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొన్ని రోజులుగా కరోనాతో ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఎస్పీ బాలు శనివారం రోజున(సెప్టెంబర్ 5,2020) తన 51వ వివాహ వార్షికోత్సవాన్ని ఆసుపత్రిలోనే తన శ్రీమతి సావిత్రితో కలిసి జరుపుకున్నట్టు సమాచారం. డాక్టర్లు, ఐసీయూ సిబ్బంది మధ్య అన్ని జాగ్రత్తల నడుమ ఈ వేడుక జరుపుకున్నట్టు సమాచారం. బాలు సతీమణి సావిత్రి ఆసుపత్రికి వెళ్లారని, ఐసీయూలోనే దంపతులు కేక్ కట్ చేసినట్లు తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టులు వైరల్ గా మారాయి.
ఆసుపత్రిలో పాట పాడిన బాలు:
ఎస్పీ బాలసుబ్రమణ్యం పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కాబోతున్న తరుణంలో ఆసుపత్రి నుండి ఆయన ఓ పాటని ఆలపించినట్టు ప్రచారం జరుగుతుంది. ఆయన పాడిన ఆడియో క్లిప్ ఇదే అంటూ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.
https://10tv.in/the-owner-who-was-tied-to-a-tree-and-beaten-for-theft-in-kadapa-district/
సోమవారం శుభవార్త వినబోతున్నారు:
కరోనా సోకడంతో ఎస్పీ బాలు ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. తొలుత ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ మధ్యలో కాస్త విషమించింది. దాంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. బాలు ఆరోగ్య ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ఆస్పత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేస్తూ వచ్చాయి. అలాగే, ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సైతం వీడియో సందేశాల ద్వారా సమాచారం అందిస్తున్నారు. దేవుని ఆశీర్వాదంతో సోమవారం ఓ శుభవార్త వినబోతున్నారని గత వీడియోలో చరణ్ ప్రకటించారు. దీంతో ఎస్పీ బాలు ఆరోగ్యం పూర్తిగా కుదుట పడిందని, సోమవారం డిశ్చార్జి కాబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు.