SPB హెల్త్ అప్‌డేట్: మరింత మెరుగ్గా బాలు ఆరోగ్యం..

SPB Health Condition: ప్రపంచవ్యాప్తంగా గాన గంధర్వుడు ఎస్.పి. బాలు కోసం అభిమానులు, సంగీత కళాకారులు చేసిన పూజలు ఫలించాయి. ప్రస్తుతం బాలు కోలుకుంటున్నారు. కోవిడ్-19తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నబాలు ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉందని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
‘బాలసుబ్రహ్మణ్యం పూర్తి స్పృహలోనే ఉన్నారు.. వైద్యానికి స్పందిస్తున్నారు. ఫిజియోథెరపీలో కూడా చురుకుగా పాల్గొంటున్నారు’ అని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కరోనా సోకడంతో బాలు ఈ నెల 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం గురించి ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు.