Samajavaragamana : ‘సామజవరగమన’ కలెక్షన్స్ దూకుడు ఆగేలా లేదు.. ఈ ఏడాది మరో చిన్న సినిమా సంచలనం..

శ్రీవిష్ణు నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సామజవరగమన' బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ దూకుడు చూపిస్తుంది. తాజాగా ఈ మూవీ..

Samajavaragamana : ‘సామజవరగమన’ కలెక్షన్స్ దూకుడు ఆగేలా లేదు.. ఈ ఏడాది మరో చిన్న సినిమా సంచలనం..

Sree Vishnu Reba Monica Samajavaragamana movie collections

Updated On : July 12, 2023 / 6:30 PM IST

Samajavaragamana : ఇటీవల టాలీవుడ్ లో చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలను నమోదు చేస్తున్నాయి. రైటర్‌ పద్మభూషణ్‌, బలగం, మేమ్‌ ఫేమస్‌, పరేషాన్‌.. సినిమాలు ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ అయ్యి మంచి విజయాలను నమోదు చేశాయి. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఎండ్ లో వచ్చిన సినిమా సామజవరగమన. టాలీవుడ్ యువ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 29న రిలీజ్ అయ్యింది. మొదటి షోకే సూపర్ హిట్ టాక్ రావడంతో ఆడియన్స్ థియేటర్స్ కి రావడం మొదలుపెట్టారు.

Lal Salaam : లాల్ సలామ్‌ షూటింగ్‌కి గుడ్ బై అంటున్న మొయ్దీన్ భాయ్‌.. అలియాస్ రజినీకాంత్!

దీంతో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి 19.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక మొదటి వారం పూర్తి చేసుకునేపాటికి ఈ చిత్రం 30.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని శ్రీవిష్ణు కెరీర్ లోనే హైయెస్ట్ గా నిలిచింది. అయితే ఈ మూవీ కలెక్షన్స్ దూకుడు అక్కడితో ఆగలేదు. తాజాగా ఈ మూవీ 40 కోట్ల మార్క్ ని క్రాస్ చేసేసింది. 12 రోజుల్లో ఈ సినిమా 40.21 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఇదే జోరు కొనసాగిస్తే మరోవారంలో 50 కోట్ల మార్క్ అందుకోవడం ఖాయం అంటున్నారు సినీ పండితులు.

Vijay : పాదయాత్ర మొదలుపెట్టబోతున్న విజయ్.. తమిళనాట వైరల్ అవుతున్న న్యూస్..!

 

View this post on Instagram

 

A post shared by Sree Vishnu (@sreevishnu29)

కాగా ఈ సినిమాకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. రెబా మోనికా జాన్ (Reba Monica John) మొదటిసారి తెలుగులో హీరోయిన్ గా కనిపిస్తూ ఈ సినిమా చేసింది. నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యింగర్, వెన్నెల కిశోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్ వంటి స్టార్ కాస్ట్ ఈ చిత్రంలో నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర ఈ మూవీకి ప్రెజెంటర్ గా వ్యవహరించగా రాజెశ్ దండా ఈ చిత్రాన్ని నిర్మించాడు. గోపిసుందర్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.