Samajavaragamana : శ్రీవిష్ణు రికార్డు కెరీర్ హైయెస్ట్.. సామజవరగమన 50 కోట్లు..!
శ్రీవిష్ణు నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సామజవరగమన 50 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని శ్రీవిష్ణుకి కెరీర్ హైయెస్ట్ ఇచ్చింది.

Sree Vishnu Samajavaragamana collections Surpassed 50 crore world wide
Samajavaragamana : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) అందరి హీరోలు మాదిరి కాకుండా ఒక సపరేట్ రూట్ లో వెళ్తుంటాడు. ఒక పక్క కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ పై సినిమాలు చేస్తూనే, మరో పక్క ప్రయోగాత్మక కథలతో కూడా ఆడియన్స్ ని పలకరిస్తుంటాడు. ఇక రీసెంట్ గా ఈ హీరో ‘సామజవరగమన’ అనే ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వచ్చాడు. జూన్ 29న రిలీజ్ అయిన మొదటి షోతోనే సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది.
Kamal Haasan : ప్రాజెక్ట్ K లో విలన్ రోల్ ఒప్పుకోవడానికి కారణం అదే.. కామిక్ కాన్ ఈవెంట్‌లో కమల్..
యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి వచ్చి ఫుల్ ఎంటర్టైన్ అవ్వొచ్చు అని రివ్యూస్ రావడంతో ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కట్టారు. దీంతో ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఓ రేంజ్ లో వచ్చాయి. మొదటి నాలుగు రోజుల్లో ఈ మూవీ 19.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇదే దూకుడుతో ఈ మూవీ మొదటి 7 రోజులు పూర్తి చేసుకునేపాటికి 30.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఇక రెండో వారంలో 40 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి 50 కోట్ల మార్క్ వైపు పరుగులు పెట్టింది.
Kamal Haasan : అమితాబ్ బచ్చన్ నటించిన ఆ సినిమా, నిర్మాతలపై నాకెంతో ద్వేషం కలిగింది..
ఇప్పుడు ఆ మార్క్ ని కూడా దాటేసింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఈ విషయాన్ని శ్రీవిష్ణు తెలియజేస్తూ.. సినిమాని ఇంతటి విజయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశాడు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా రెబా మోనికా జాన్ (Reba Monica John) నటించింది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యింగర్, వెన్నెల కిశోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్ వంటి స్టార్ కాస్ట్ నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర ఈ మూవీకి ప్రెజెంటర్ గా వ్యవహరించగా రాజెశ్ దండా ఈ చిత్రాన్ని నిర్మించాడు. గోపిసుందర్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.
View this post on Instagram