Sreeleela : కన్నడ స్టార్ హీరో యశ్ ఫ్యామిలీ శ్రీలీల ఫ్యామిలీకి చాలా క్లోజ్ అంట.. శ్రీలీల యశ్‌ని బావా అంటూ..

శ్రీలీల తల్లి బెంగుళూరులో ప్రముఖ గైనకాలజిస్ట్. అయితే శ్రీలీల ఫ్యామిలీకి యశ్ ఫ్యామిలీ మధ్య మంచి బంధం ఉందట.

Sreeleela : కన్నడ స్టార్ హీరో యశ్ ఫ్యామిలీ శ్రీలీల ఫ్యామిలీకి చాలా క్లోజ్ అంట.. శ్రీలీల యశ్‌ని బావా అంటూ..

Sreeleela and her family is very close to Hero Yash and his wife Radhika Family secret reveals by Sreeleela

Updated On : August 28, 2023 / 10:02 AM IST

Sreeleela : కెజిఎఫ్(KGF) సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు కన్నడ హీరో యశ్(Yash). ప్రస్తుత యశ్ కి ఇండియా అంతటా అభిమానులు ఉన్నారు. ఆయన నెక్స్ట్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక శ్రీలీల ప్రస్తుతం తెలుగులో ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా అందరి హీరోల పక్కన హీరోయిన్ గా చేసేస్తూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా అంది శ్రీలీల.

శ్రీలీల తన డ్యాన్స్, తన అందంతో టాలీవుడ్ లో బోలెడంతమంది అభిమానులని సంపాదించుకుంది. శ్రీలీల గురించి మన తెలుగు ఆడియన్స్, అభిమానులు ఇంకా ఇంకా తెలుసుకోవాలనుకుంటూనే ఉంటారు. శ్రీలీల ప్రస్తుతం MBBS ఫైనల్ సంవత్సరం చదువుతుందని సమాచారం. ఇక శ్రీలీల తల్లి బెంగుళూరులో ప్రముఖ గైనకాలజిస్ట్. అయితే శ్రీలీల ఫ్యామిలీకి యశ్ ఫ్యామిలీ మధ్య మంచి బంధం ఉందట.

యశ్ భార్య రాధికకు రెండుసార్లు శ్రీలీల వాళ్ళ అమ్మే డెలివరీ చేసిందట. ఆ సమయంలో రాధికని శ్రీలీల వాళ్ళ అమ్మ ఎంతో జాగ్రత్తగా చేసుకున్నారట. దీంతో శ్రీలీల వాళ్ళ అమ్మని యశ్ ఫ్యామిలీ చాలా గౌరవించేవారు. అదే సమయంలో శ్రీలీల కూడా రెగ్యులర్ గా హాస్పిటల్ కి వెళ్తుండటంతో రాధిక, యశ్ ఫ్యామిలీతో మంచి సంబంధాలు నెలకొన్నాయి. శ్రీలీల రాధికని అక్కా అని, యశ్ ని బావా అని పిలుస్తుంది. వీరి మధ్య అంత క్లోజ్‌నెస్ కూడా ఉందని శ్రీలీల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

Ira Khan : పెళ్లికిముందే హనీమూన్‌కి వెళ్లిన స్టార్ హీరో కూతురు.. వైరల్ అవుతున్న ఫొటోలు..

అందుకే శ్రీలీల మొదటి సినిమా ప్రమోషన్స్ కి యశ్ కూడా వచ్చాడు. ఇక శ్రీలీల యశ్ వాళ్ళ ఇంటికి వెళ్లి అప్పుడప్పుడు వాళ్ళ పిల్లలతో ఆడుకుంటుంది. పలుమార్లు యశ్ పిల్లలతో ఫొటోలు కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రీలీల. అసలే శ్రీలీల ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిపోయింది. భవిష్యత్తులో యశ్ పక్కన చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు, శ్రీలీల సినిమా ప్రమోషన్స్ కి యశ్ మళ్ళీ రావొచ్చు కూడా అని నెటిజన్లు, అభిమానులు అంటున్నారు.