Sreeleela : స్టేజిపై ఎమోషనల్ అయిన శ్రీలీల.. నాన్న వదిలేసి వెళ్లిన లోటుని గుర్తు చేసుకుంటూ బాలయ్య నాన్నలా..

శ్రీలీల తండ్రి ఆమె చిన్నప్పుడే వాళ్ళ అమ్మతో విడాకులు తీసుకొని దూరంగా వెళ్లిపోయారు. దీంతో శ్రీలీల చిన్నప్పుడు తండ్రి ప్రేమకు దూరమైంది. అది గుర్తు చేసుకుంటూ ఇండైరెక్ట్ గా నేను లైఫ్ లో చూడలేని అనుభవాలు బాలయ్య గారు ఈ సినిమాతో ఇచ్చారు అని చెప్తూ ఎమోషనల్ అయింది.

Sreeleela : స్టేజిపై ఎమోషనల్ అయిన శ్రీలీల.. నాన్న వదిలేసి వెళ్లిన లోటుని గుర్తు చేసుకుంటూ బాలయ్య నాన్నలా..

Sreeleela Emotional Speech in Bhagavanth Kesari Movie Trailer Launch Event

Sreeleela :  ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్స్ లో శ్రీలీల ఒకరు. వరుస సినిమాలతో దాదాపు డజను పైగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఓ పక్కన హీరోయిన్ గా నటిస్తూనే మరో పక్క డిఫరెంట్ పాత్రలు కూడా చేస్తుంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) ద‌ర్శ‌క‌త్వంలో బాలకృష్ణ (Balakrishna) హీరోగా తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి(Bhagavanth Kesari)లో శ్రీలీల(Sreeleela) బాలయ్య బాబుకి కూతురి పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

తాజాగా నిన్న రాత్రి భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి బాలకృష్ణ, కాజల్, శ్రీలీల, చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. ఈవెంట్ కి బాలయ్య అభిమానులు, ప్రేక్షకులు చాలా మంది వచ్చి సందడి చేశారు. ఈ ఈవెంట్లో శ్రీలీల మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. సినిమా గురించి మాట్లాడిన అనంతరం బాలయ్యతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడింది. శ్రీలీల తండ్రి ఆమె చిన్నప్పుడే వాళ్ళ అమ్మతో విడాకులు తీసుకొని దూరంగా వెళ్లిపోయారు. దీంతో శ్రీలీల చిన్నప్పుడు తండ్రి ప్రేమకు దూరమైంది. అది గుర్తు చేసుకుంటూ ఇండైరెక్ట్ గా నేను లైఫ్ లో చూడలేని అనుభవాలు బాలయ్య గారు ఈ సినిమాతో ఇచ్చారు అని చెప్తూ ఎమోషనల్ అయింది.

Also Read : Anil Ravipudi : అనిల్ రావిపూడి వాళ్ళ నాన్న ఏం చేస్తారో తెలుసా? అలాంటి మాములు లైఫ్ నుంచి వచ్చి కొడుకు స్టార్ డైరెక్టర్ గా..

శ్రీలీల మాట్లాడుతూ.. ప్రతి సినిమాలో సోల్ క్యారెక్టర్ దొరకదు. ఈ సినిమాలో విజ్జి పాప క్యారెక్టర్ లో అది ఉంది. ఆ క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయ్యాను. ఈ రోల్ చేయడం నా అదృష్టం. అనిల్ రావిపూడి ఈ క్యారెక్టర్ ని చాలా బాగా రాసారు. ఇలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు అనిల్ గారికి రుణపడి ఉంటాను. కొన్ని సీన్స్ లో కట్ చెప్పిన తర్వాత కూడా అదే మూడ్ లో ఉంటే బాలయ్య గారు నవ్వించేవారు. అంతలా కనెక్ట్ అయ్యాను ఈ సినిమాకు. నా లైఫ్ లో నాకు ఏ అనుభవాలు అయితే లేవో అవి ఈ సినిమాతో బాలయ్య గారు ఇచ్చారు. ఇది ఒక అందమైన కథ అని చెప్తూ ఎమోషనల్ అయింది. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.