Sreeleela : రష్మిక మందన్నా ప్లేస్ కూడా రీప్లేస్ చేసేసిన శ్రీలీల.. నితిన్ సినిమాలో రష్మిక అవుట్.. శ్రీలీల ఇన్..

తనకి వచ్చే సినిమాలే కుకుండా ఏదైనా సినిమాలో అనివార్య కారణాలతో హీరోయిన్ తప్పుకున్నా, తప్పించినా వాటిల్లో శ్రీలీల ఫస్ట్ ఛాయస్ గా కనిపిస్తుంది దర్శక నిర్మాతలకు. తాజాగా మరో సినిమా ఆఫర్ కూడా శ్రీలీలకు వచ్చినట్టు సమాచారం.

Sreeleela : రష్మిక మందన్నా ప్లేస్ కూడా రీప్లేస్ చేసేసిన శ్రీలీల.. నితిన్ సినిమాలో రష్మిక అవుట్.. శ్రీలీల ఇన్..

Sreeleela Replace Rashmika Mandanna Place in Nithinn Venky Kudumula Movie

Updated On : August 19, 2023 / 2:06 PM IST

Sreeleela : శ్రీలీల తెలుగులో వరుసగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పెళ్లి సందD సినిమాతో క్యూట్ గా ఉంది ఈ అమ్మాయి అని అంతా మెచ్చుకున్నారు. ఇక ధమాకా(Dhamaka) సినిమాతో ఈ అమ్మాయి ఇంత మాస్ ఉందేంటి అని ఆశ్చర్యపోయారు. ధమాకా సినిమాలో తన మాస్ డ్యాన్స్ తో అదరగొట్టిన శ్రీలీల ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. అటు అభిమానులని, ఇటు సినిమా ఆఫర్లని ఒకేసారి సంపాదించుకుంది. అమ్మడి చేతిలో ప్రస్తుతం తెలుగు, కన్నడ కలిపి దాదాపు 10 సినిమాలు ఉన్నాయి.

తనకి వచ్చే సినిమాలే కుకుండా ఏదైనా సినిమాలో అనివార్య కారణాలతో హీరోయిన్ తప్పుకున్నా, తప్పించినా వాటిల్లో శ్రీలీల ఫస్ట్ ఛాయస్ గా కనిపిస్తుంది దర్శక నిర్మాతలకు. తాజాగా మరో సినిమా ఆఫర్ కూడా శ్రీలీలకు వచ్చినట్టు సమాచారం. వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వంలో నితిన్(Nithiin), రష్మిక(Rashmika) జంటగా వచ్చిన భీష్మ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే కాంబోలో మరో సినిమాని కూడా అనౌన్స్ చేశారు. నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా ఓపెనింగ్ కూడా చేసి కొంత భాగం షూట్ కూడా చేశారు.

కానీ ఈ సినిమా నుంచి కొన్ని కారణాలతో రష్మిక తప్పుకుందని ఇటీవల వార్తలు వచ్చాయి. రష్మిక ఎందుకు తప్పుకుందో మాత్రం ఎవరికీ తెలియదు. అయితే ఈ సినిమాలో రష్మిక ప్లేస్ లో శ్రీలీలను తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శ్రీలీల నితిన్ సరసన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు నితిన్ – వెంకీ కుడుముల సినిమాలో కూడా శ్రీలీలను తీసుకున్నట్టు సమాచారం.

Allu Arjun : మామ కోసం వచ్చిన ఐకాన్ స్టార్.. నల్గొండలో అల్లు అర్జున్ హంగామా..

దీంతో ఏకంగా రష్మిక ప్లేస్ ని కూడా శ్రీలీల రీప్లేస్ చేసేసింది. గతంలో పూజా హెగ్డే ప్లేస్ ని కూడా రీప్లేస్ చేసింది. ఇలా స్టార్ హీరోయిన్స్ కి శ్రీలీల ఎసరు పెడుతుందని కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలీల మాత్రం దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టు వచ్చిన ప్రతి ఛాన్స్ ని ఓకే చేసేస్తోంది. అయితే ధమాకా తర్వాత శ్రీలీల నుంచి ఇంకా ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. త్వరలోనే ఈ అమ్మడి సినిమాలు స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇవి రిలీజయితే కానీ ఈ అమ్మడి స్టార్ డం ఇలాగే ఉంటదా, తగ్గుతుందా చూడాలి మరి.