Peddi : పెద్ది మూవీలో శ్రీలీల స్పెష‌ల్ సాంగ్..!

పెద్ది మూవీలో ఓ మాస్ స్పెషల్ సాంగ్ కోసం రామ్ చరణ్ సరసన శ్రీలీల స్టెప్పులు వేయబోతుందట

Peddi : పెద్ది మూవీలో శ్రీలీల స్పెష‌ల్ సాంగ్..!

SreeLeela special song in the Peddi movie

Updated On : May 3, 2025 / 11:09 AM IST

పెద్ది మూవీలో ఓ మాస్ స్పెషల్ సాంగ్ కోసం రామ్ చరణ్ సరసన శ్రీలీల స్టెప్పులు వేయబోతుందట. డైరెక్టర్ బుచ్చి బాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇండస్ట్రీ బజ్ ప్రకారం.. ఏఆర్ రహమాన్ కంపోజ్ చేస్తున్న ఒక ఫుల్ ఎనర్జిటిక్ మాస్ సాంగ్ స్పెషల్ సెటప్ రెడీ అయ్యిందట.

ఆ పాటలో చరణ్ స్టైల్, శ్రీలీల గ్రేస్ కలిస్తే.. థియేటర్లలో ఇక మాస్ ఎక్స్‌ప్రోషన్ ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈపాట రామ్ చరణ్ పాత్రకు టర్నింగ్ పాయింట్‌గా ఉండబోతుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. శ్రీలీల ఎంట్రీతో మాస్ ఆడియెన్స్‌లో మరింత హైప్ క్రియేట్ చేయడమే టీం లక్ష్యమట.

HIT 3 collections : బాక్సాఫీస్ వ‌ద్ద నాని జోరు.. రెండు రోజుల్లో ‘హిట్ 3’వ‌సూళ్లు ఎంతంటే..?

ఇక ఈ సినిమాలో రాంచరణ్ కు జోడిగా జాహ్నవి కపూర్ నటిస్తుందట‌. చరణ్-శ్రీలీల కాంబినేషన్ ఆన్ స్క్రీన్ మీద చూడాలనేది మాత్రం ఫ్యాన్స్ డ్రీమ్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా 1980లో గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో రూపొందుతోంది. మరి పెద్ది సినిమాతో చరణ్ ఏ విధంగా గర్జించబోతున్నాడనేది త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్క్రతం కానుంది. అంత వరకు ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే.