SSMB29 : మహేష్-రాజమౌళి సినిమా గురించి శ్రీసింహ కామెంట్స్.. వర్క్ స్టార్టింగ్ స్టేజిలో..!

మహేష్-రాజమౌళి సినిమా పై ఇండియా వైడ్ ఎంతో ఆసక్తి నెలకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి కీరవాణి తనయుడు శ్రీసింహ..

SSMB29 : మహేష్-రాజమౌళి సినిమా గురించి శ్రీసింహ కామెంట్స్.. వర్క్ స్టార్టింగ్ స్టేజిలో..!

Sri Simha about Mahesh Babu SSMB29 works at Bhaag Saale movie promotions

Updated On : July 5, 2023 / 10:01 PM IST

SSMB29 : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కలయికలో రాబోతున్న సినిమా పై టాలీవుడ్ లోనే కాదు ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని అమెజాన్ అడవులు నేపథ్యంతో యాక్షన్ అండ్ అడ్వెంచర్స్ గా తెరకెక్కించబోతున్నట్లు రాజమౌళి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం జక్కన్న హాలీవుడ్ సంస్థలతో కూడా ఒప్పందం కుదుర్చుకోవడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Kriti Sanon : నిర్మాణ సంస్థని అనౌన్స్ చేసిన కృతి సనన్.. సుశాంత్ సింగ్ జ్ఞాపకాలతో ప్రొడక్షన్ హౌస్ పేరు..!

దీంతో రాజమౌళి కుటుంబం ఎక్కడ కనిపించినా ఈ సినిమా గురించి ప్రశ్నిస్తూనే వస్తున్నారు. తాజాగా ఎం ఎం కీరవాణి తనయుడు శ్రీసింహ తన కొత్త మూవీ ‘భాగ్ సాలే’ (Bhaag Saale) ప్రమోషన్స్ లో ఉండగా మీడియా ప్రతినిధులు SSMB29 వర్క్స్ ఎంతవరకు వచ్చాయని ప్రశ్నించారు. దీనికి శ్రీసింహ బదులిస్తూ.. “ఆ సినిమా కోసం మా కుటుంబంలోని వారు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన వర్క్ స్టార్టింగ్ స్టేజిలో ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు.

Allu Arjun : సామజవరగమన పై అల్లుఅర్జున్ ట్వీట్‌.. నా మలయాళీ భామ రెబా మోనికా జాన్..

ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ మూవీ ఎండింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకు కొన‌సాగింపుగా మ‌రో చిత్రాన్ని తెర‌కెక్కించే విధంగా క్లైమాక్స్‌ ఉంటుంద‌ని, అందుకు త‌గ్గ‌ట్లుగానే సీన్స్ రాసిన‌ట్లు వెల్ల‌డించారు. దీంతో ఈ మూవీకి సీక్వెల్ ఉండబోతుందా? అని అందరిలో క్యూరియాసిటీ నెలకుంది. కాగా మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం (Guntur Karam) సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యిన తరువాతే రాజమౌళి సినిమాకి షిఫ్ట్ అవ్వనున్నాడు.