Sridevi : అతిలోక సుందరి ఆస్తుల విలువ ఎంతో తెలుసా
అలనాటి అందాల తార శ్రీదేవి అతిలోక సుందరిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ముగ్ద మనోహరమైన అందం ఆమె సొంతం. అందంతోనే కాదు తన అభినయంతోనూ ప్రేక్షకులను

Sridevi
Sridevi : అలనాటి అందాల తార శ్రీదేవి అతిలోక సుందరిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ముగ్ద మనోహరమైన అందం ఆమె సొంతం. అందంతోనే కాదు తన అభినయంతోనూ ప్రేక్షకులను ప్రభావితం చేసింది. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. దుబాయ్ లో శ్రీదేవి ఆకస్మిక మరణం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవగా.. ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడిపోయి శ్రీదేవి చనిపోయిందని అక్కడి పోలీసులు నిర్దారించారు. కాగా ఆగస్టు 13 శ్రీదేవి జయంతి.
ఆకస్మిక మరణానికి కొన్ని రోజుల ముందు.. శ్రీదేవి సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. సీనియర్ హీరోయిన్లలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటిగా కొనసాగుతోంది. కాగా, శ్రీదేవి చనిపోయే వరకు ఆమెకున్న ఆస్తుల విలువకు సంబంధించిన ఒక న్యూస్ అటు బీటౌన్ లో, ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫ్రీ ప్రెస్ జర్నల్ కథనం ప్రకారం..శ్రీదేవి, బోనీకపూర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు (శ్రీదేవి చనిపోయేనాటికి). ఈ ఇద్దరికి మూడు పెద్ద ప్రాపర్టీలతోపాటు కొన్ని లగ్జరీ కార్లు ఇతర పెట్టుబడులున్నాయి.
శ్రీదేవి తన కూతురు జాన్వీకపూర్ ను సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా చూడాలని కలలు కనేది. దురదృష్ణవశాత్తు జాన్వీకపూర్ నటించిన తొలి సినిమా దఢక్ చూడకముందే శ్రీదేవి తుదిశ్వాస విడిచింది. శ్రీదేవి నట వారసత్వాన్ని కొనసాగిస్తోంది జాన్వీకపూర్. మరోవైపు శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా ఎంట్రీకి రెడీ అవుతోంది.
శ్రీదేవి పెద్దకూతురు జాన్వీ కపూర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఆమె మరణం సంభవించింది.త్వరలో శ్రీదేవి చిన్నకూతురు ఖుషి కపూర్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.
చిన్న వయస్సులోనే శ్రీదేవి బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టి తక్కువ సమయంలోనే విజయాలను అందుకున్నారు. వరుసగా తెలుగు, తమిళంలో స్టార్ హీరోలకు జోడీగా నటించి అప్పటి స్టార్ హీరోయిన్లకు శ్రీదేవి గట్టి పోటీ ఇచ్చారు. బాలీవుడ్ లోనూ శ్రీదేవి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోవడం విశేషం. దాదాపు మూడు దశాబ్దాల పాటు శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు.