18 ఏళ్ళ స్టూడెంట్ నెం.1 – ఆ రోజులు గుర్తు చేసుకున్న జక్కన్న, తారక్

2001 సెప్టెంబర్ 27న విడుదలైన స్టూడెంట్ నెం.1.. 019 సెప్టెంబర్ 27నాటికి 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఎన్టీఆర్, రాజమౌళి అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు..

  • Published By: sekhar ,Published On : September 28, 2019 / 07:49 AM IST
18 ఏళ్ళ స్టూడెంట్ నెం.1 – ఆ రోజులు గుర్తు చేసుకున్న జక్కన్న, తారక్

Updated On : September 28, 2019 / 7:49 AM IST

2001 సెప్టెంబర్ 27న విడుదలైన స్టూడెంట్ నెం.1.. 019 సెప్టెంబర్ 27నాటికి 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఎన్టీఆర్, రాజమౌళి అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు..

స్టూడెంట్ నెం.1.. హీరోగా జూనియర్‌ ఎన్టీఆర్‌కి రెండో సినిమా.. దర్శకుడిగా రాజమౌళికి మొదటి సినిమా.. వీరిద్దరి కలయికలో వచ్చిన ఫస్ట్ బ్లాక్ బస్టర్.. 2001 సెప్టెంబర్ 27న విడుదలైన ఈ సినిమా.. 2019 సెప్టెంబర్ 27నాటికి 18 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తారక్, జక్కన్న సోషల్ మీడియా ద్వారా తమ అనుభవాలను ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌తో షేర్ చేసుకున్నారు.

స్టూడెంట్ నెం.1 టైములో దిగిన ఫోటోల మాదిరిగానే మరోసారి ఫోటోలు దిగారు. రామోజీ ఫిలిం సిటీలో స్టూడెంట్ నెం.1 షూటింగ్ జరిగిన స్పాట్‌లోనే  ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూట్ జరుగుతుంది. ‘18 ఏళ్లవుతోంది ‘స్టూడెంట్‌ నెం.1’ చిత్రం రిలీజ్‌ అయి. అదే లొకేషన్‌లో ఇవాళ మళ్లీ షూట్‌ చేస్తున్నాం. ఈ 18 ఏళ్లలో చాలా మారాయి. కానీ రాజమౌళితో పని చేయడంలో ఉండే ఫన్‌ మాత్రం మారలేదు’’ అంటూ తారక్ ఒక ఫోటోను షేర్‌ చేశాడు..

Read Also : భారీ ధరకు సరిలేరు నీకెవ్వరు – ఓవర్సీస్ రైట్స్..

‘ఈ 18 ఏళ్లలో ఎన్నో మారాయి. తను (ఎన్టీఆర్‌) సన్నగా అయ్యాడు, వయసు రీత్యా నేను పెద్ద అయ్యాను. మేమిద్దరం ఇంకాస్త తెలివిగలవాళ్లమయ్యాం’ అని రాజమౌళి మరో ఫోటోను షేర్‌ చేశారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.