చిరు ఉయ్యాలవాడకు ఊపిరి పోశారు : రాజమౌళి
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చూసి, తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలిపారు..

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చూసి, తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలిపారు..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ.. సైరా నరసింహారెడ్డి.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ‘సైరా’ భారీగా విడుదలైంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన సైరా మూవీ పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఈ సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమా చూసి, తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Read Also : చిరు ఇంట్లో ‘సైరా’ సంబరాలు!
‘మెగాస్టార్ చిరంజీవి.. ఉయ్యాలవాడ పాత్రకు ఊపిరి పోశారు.. నరసింహారెడ్డి చరిత్రను అద్భుతంగా చూపించారు.. జగపతిబాబు, నయనతార, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతి వాళ్ల పాత్రల్లో చాలా బాగా నటించారు. చిరంజీవి, రామ్ చరణ్, సురేందర్ రెడ్డిలకు కంగ్రాట్స్’ అంటూ ట్వీట్ చేశారు రాజమౌళి..