కరోనా వైరస్‌పై రాజ‌మౌళి ట్విట్

  • Published By: veegamteam ,Published On : March 16, 2020 / 05:49 AM IST
కరోనా వైరస్‌పై రాజ‌మౌళి ట్విట్

Updated On : March 16, 2020 / 5:49 AM IST

క‌రోనా వైర‌స్ రోజురోజుకి వ్యాపిస్తోంది. ఇప్ప‌టికే 157 దేశాలకు స్ప్రెడ్ అయ్యింది. ఈ వైరస్ కారణంగా రోజు రోజుకి మృతుల సంఖ్య పెరుగుతోంది. అందుకని కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే థియేట‌ర్స్‌, స్కూల్స్‌, బార్స్ , ప‌బ్స్, జిమ్స్ అన్ని (మార్చి 31, 2020) వ‌ర‌కు మూత‌ప‌డ్డాయి.  ఈ సందర్భంగా కరోనా వైరస్ పై రాజ‌మౌళి త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.

ఈ వైరస్ వల్ల ప్రపంచం నిలిచిపోవ‌డం చూస్తుంటే షాకింగ్‌ గా ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల‌లో భ‌యాందోళ‌న‌లు వ్యాప్తి చెంద‌కుండా ఉండటం చాలా అవ‌స‌రం. కరోనా వ్యాప్తిని నివారించ‌డానికి జాగ్రత్తలు పాటించండి అని రాజ‌మౌళి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. 

అంతేకాదు ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో చాలా మంది విదేశీయుల న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. విదేశీయుల వీసాల‌ని కేంద్రం తాత్కాలిక‌ ర‌ద్దు చేసిన నేప‌థ్యంలో RRR చిత్ర షూటింగ్‌కి బ్రేక్ పడే అవ‌కాశం ఉంద‌ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.