Stephen ‘tWitch’ Boss : ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ డాన్సర్..

అమెరికన్ ప్రముఖ హిప్ హాప్ డాన్సర్, నటుడు, డీజే మరియు టెలివిజన్ ప్రొడ్యూసర్ 'స్టీఫెన్ ట్విచ్ బాస్' మంగళవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్టీఫెన్..

Stephen ‘tWitch’ Boss : ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ డాన్సర్..

Stephen 'tWitch' Boss got suicide

Updated On : December 15, 2022 / 12:50 PM IST

Stephen ‘tWitch’ Boss : అమెరికన్ ప్రముఖ హిప్ హాప్ డాన్సర్, నటుడు, డీజే మరియు టెలివిజన్ ప్రొడ్యూసర్ ‘స్టీఫెన్ ట్విచ్ బాస్’ మంగళవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్టీఫెన్.. ‘ది ఎల్లెన్ డిజెనెర్స్ షో’ ‘సో యు థింక్ యు కెన్ డ్యాన్స్’ అనే షోలతో బాగా పాపులర్ అయ్యాడు. అలాగే ‘స్టెప్ అప్’ మరియు ‘మ్యాజిక్ మైక్ XXL’ వంటి సినిమాల్లో కూడా నటించి అలరించాడు.

Superman : ‘సూపర్‌మ్యాన్‌’ ఇక తిరిగి రాను అంటున్నాడు..

కాగా 40 ఏళ్ల స్టీఫెన్ మంగళవారం నాడు ఒక హోటల్‌లో తలపై తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్ TMZ ప్రకటించింది. స్టీఫెన్ సోమవారం (డిసెంబర్ 12) రాత్రి బస చేసేందుకు ఒక హోటల్‌కి వెళ్ళాడు. ఆ హోటల్ కూడా అతని నివాసానికి దగ్గరలోనే ఉంది. అయితే మంగళవారం స్టీఫెన్ చెక్-అవుట్ సమయం పూర్తయిన హోటల్ రూమ్ నుంచి బయటకి రాకపోవడంతో హోటల్ సిబ్బంది లోపలికి వెళ్లి చూశారు.

హోటల్ రూమ్ బాత్రూంలో తలపై తుపాకీ గాయంతో స్టీఫెన్ మృతదేహం కనిపించడంతో లాస్ ఏంజిల్స్ పోలీసులకు తెలియజేశారు హోటల్ సిబ్బంది. వైద్యులు పరీక్షించగా.. స్టీఫెన్ 11:15 గంటల సమయంలో మరణించినట్లు ప్రకటించారు. అయితే హోటల్ సిబ్బందికి ఎటువంటి గన్ సౌండ్ వినిపించలేదు అని తెలుపుతుంది. కాగా స్టీఫెన్ భార్య.. “స్టీఫెన్ ఒక మంచి భర్త, తండ్రి, స్నేహితుడు మరియు అభిమానులకు స్ఫూర్తి” అంటూ వ్యాఖ్యానించింది. అయితే స్టీఫెన్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు.