Superman : ‘సూపర్‌మ్యాన్’ ఇక తిరిగి రాను అంటున్నాడు..
హాలీవుడ్ సినిమాలో ఇప్పుడు అంటే ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ గురించి ఎక్కువుగా మాట్లాడుకుంటున్నాము గాని.. ఒకప్పుడు సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ప్రపంచం మొత్తానికి సూపర్ హీరోలు. DC స్టూడియోస్ నుంచి వచ్చిన ఈ సూపర్ హీరో మూవీస్ లో 'సూపర్‌మ్యాన్' సిరీస్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే...

Superman didnt come back
Superman : హాలీవుడ్ సినిమాలో ఇప్పుడు అంటే ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ గురించి ఎక్కువుగా మాట్లాడుకుంటున్నాము గాని.. ఒకప్పుడు సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ప్రపంచం మొత్తానికి సూపర్ హీరోలు. DC స్టూడియోస్ నుంచి వచ్చిన ఈ సూపర్ హీరో మూవీస్ లో ‘సూపర్‌మ్యాన్’ సిరీస్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఇప్పటికే ఈ మూవీ సిరీస్ లో నటించిన హీరోలు మారుతూ వస్తుండగా, తాజాగా మరోసారి సూపర్ మ్యాన్ పాత్రదారుడు మారునున్నట్లు ప్రకటించారు మేకర్స్.
Avatar 2: గ్లోబల్ స్థాయిలో రిలీజ్‌తోనే చరిత్ర సృష్టిస్తున్న అవతార్-2
2013లో విడుదలైన ‘మ్యాన్ ఆఫ్ స్టీల్’ సినిమా నుంచి సూపర్‌మ్యాన్ పాత్రలో ‘హెన్రీ కావిల్’ నటిస్తూ వస్తున్నాడు. తాజాగా DC స్టూడియోస్ కొత్త కో-ఛైర్మన్ గా గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ మూవీ డైరెక్టర్ ‘జేమ్స్ గన్’ భాద్యతలు తీసుకున్నాడు. అయితే అయన రాసే కొత్త సూపర్‌మ్యాన్ సినిమా కథలో హీరోగా హెన్రీ కావిల్ కాకుండా మరో కొత్త నటుడిని తీసుకోడానికి నిర్ణయం తీసుకున్నాడు డైరెక్టర్ జేమ్స్.
కాగా అక్టోబర్‌లో హెన్రీ కావిల్ నెట్‌ఫ్లిక్స్ షో ది విట్చర్‌లో ప్రధాన పాత్రకు రాజీనామా చేసి సూపర్‌మ్యాన్‌గా కనిపించేందుకు తిరిగి వచ్చాడు. ఇప్పుడు డైరెక్టర్ జేమ్స్ నిర్ణయంతో సీన్ అంతా రివర్స్ అయ్యింది. దీంతో ఈ నిర్ణయంపై హెన్రీ కావిల్ స్పందిస్తూ.. “నేను సూపర్‌మ్యాన్‌గా తిరిగి రాను. ఈ వార్త అంత సులభమైనది కాదు. కానీ మరో కొత్త కథ రావడానికి ఇది తప్పదు. జేమ్స్ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. అలాగే భవిషత్తు సూపర్‌మ్యాన్ నిర్మాణంలో పాలుపంచుకొనే వారందరికీ నా శుభాకాంక్షలు” అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసొకొచ్చాడు.