Suhana Khan : సెలబ్రిటీస్ అందరికి అలియా మంచి సందేశం ఇచ్చారు.. షారుఖ్ కూతురు సుహానా కామెంట్స్..

అలియా భట్ ఒక మంచి స్టెప్ తీసుకోని సెలబ్రిటీస్ అందరికి ఆదర్శంగా నిలిచారని షారుఖ్ కూతురు సుహానా కామెంట్స్ చేశారు. ఏంటి ఆ స్టెప్..?

Suhana Khan : సెలబ్రిటీస్ అందరికి అలియా మంచి సందేశం ఇచ్చారు.. షారుఖ్ కూతురు సుహానా కామెంట్స్..

Suhana Khan praises Alia Bhatt for taking great step about environment

Updated On : November 29, 2023 / 9:26 AM IST

Suhana Khan : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ వారసురాలు సుహానా ఖాన్.. తన యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఒక షార్ట్ ఫిలింలో నటించిన సుహానా.. ఇప్పుడు ‘ది ఆర్చీస్’ (The Archies) అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అవ్వబోతున్నారు. టీనేజ్ మ్యూజికల్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 7న రిలీజ్ కి సిద్ధవుతుంది. అయితే ఈ మూవీ థియేటర్ లో కాకుండా ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న సుహానా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.

ఈక్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరోయిన్ అలియా భట్ గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. అలియా ఇటీవల నేషనల్ అవార్డుని అందుకున్న విషయం తెలిసిందే. ఆ అవార్డు అందుకోవడానికి అలియా తన పెళ్ళినాటి చీరని ధరించి వెళ్లారు. ఆ సమయంలో రీ యూజ్ అంటూ అలియా చేసిన పోస్ట్ కూడా బాగా వైరల్ అయ్యింది. సాధారణంగా సెలబ్రిటీస్ చాలావరకు ఒకసారి ధరించిన డ్రెస్సుని మరోసారి ధరించారు. కొందరు సెలబ్రిటీస్ కి ఇలా ఒకసారే ధరించి, దానిని పక్కన పడేయడం ఇష్టం ఉండదు.

Also read : Salman Khan : బాలీవుడ్ ప్రముఖ నటుడికి మళ్లీ బెదిరింపు…పోలీసుల భద్రతా సమీక్ష

కానీ మిగితా సెలబ్రిటీస్ అంతా అదే ఫాలో అవుతున్నారని, ఇష్టం లేకున్నా వారు అదే చేస్తుంటారు. అయితే ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్.. ఒకరి కోసం ఒకరు ‘వన్ టైం యూజ్’ అనే పద్ధతి ఫాలో అవుతున్నవారే ఎక్కువ. ఈ పద్ధతిని బ్రేక్ చేయడానికి అలియా మొదటి అడుగు తీసుకున్నారు. ఈక్రమంలోనే ప్రతిష్టాత్మకమైన నేషనల్ అవార్డుని అందుకోవడానికి రీ యూజ్ డ్రెస్సులో వెళ్లి ఒక మంచి సందేశం ఇచ్చారు. ఈ విషయాన్ని సుహానా మాట్లాడారు. అలియా ఒక మంచి స్టెప్ తీసుకోని సెలబ్రిటీస్ అందరికి ఆదర్శంగా నిలిచారని చెప్పుకొచ్చారు. ఈ రీ యూజ్ అనేది ఇప్పుడు తప్పనిసరని, పర్యావరణ పరిరక్షణకు ఈ పద్ధతి అవసరం అంటూ చెప్పుకొస్తూ అలియా పై ప్రశంసలు కురిపించారు.