‘శ్రీరంగనీతులు’ మూవీ రివ్యూ.. మూడు కథలతో.. మనిషి ఎలా బతకాలి..

'శ్రీరంగనీతులు' సినిమాలో జీవితం గురించి, జీవితంలో ఎలా ఉండాలి అని మూడు కథలతో చక్కగా చూపించారు.

‘శ్రీరంగనీతులు’ మూవీ రివ్యూ.. మూడు కథలతో.. మనిషి ఎలా బతకాలి..

Suhas Ruhani Sharma Viraj Ashwin Sriranga Neethulu Movie Review and Rating

Updated On : April 11, 2024 / 10:04 AM IST

Sriranga Neethulu Movie Review : సుహాస్‌(Suhas), రుహానీశర్మ, విరాజ్‌ అశ్విన్‌, కార్తీక్‌రత్నం మెయిన్ లీడ్స్ లో ప్రవీణ్‌కుమార్‌ దర్శకత్వంలో వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘శ్రీరంగనీతులు. నిర్మాత ధీరజ్ మొగిలినేని ఈ సినిమాని నేడు ఏప్రిల్‌ 11న విడుదల చేశారు. మూడు వేరువేరు కథలతో ఆంథాలజీ జానర్ లో ఈ సినిమా తెరకెక్కింది.

కథ విషయానికొస్తే.. ఇందులో మూడు కథలు ఒకేసారి నడుస్తూ ఉంటాయి. మొదటి కథలో.. శివ(సుహాస్) హైదరాబాద్ లోని ఓ బస్తిలో ఉంటూ సామ్‌సంగ్ లో టెక్నిషియన్ గా జాబ్ చేస్తూ ఉంటాడు. బస్తీలో కుర్రాళ్ళ మధ్య గొప్పగా ఉండాలని, వేరే కుర్రాళ్ళ గ్యాంగ్ ముందు బిల్డప్ కొట్టాలని ఆ ఏరియా రాజకీయ నాయకుడితో ఫొటో దిగి బతుకమ్మకు గ్రౌండ్ లో పెద్ద ఫ్లెక్సీ వేయిస్తాడు. తెల్లారేసరికి ఆ ఫ్లెక్సీ ఉండదు. ఆ ఫ్లెక్సీ వేరే గ్యాంగ్ చించేశారని తెలుస్తుంది. దీంతో వాళ్ళతో గొడవ పెట్టుకోవాలని చూస్తాడు శివ. మళ్ళీ ఫ్లెక్సీని వేయించాలని చూస్తాడు.

ఇక రెండో కథలో.. ఇందు(రుహాణి శర్మ) వరుణ్(విరాజ్ అశ్విన్) ప్రేమికులు. ఇందు తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పడానికి భయపడుతుంది. అంతలోనే ఇంట్లో వాళ్ళు ఓ పెళ్లి సంబంధం ఓకే చేస్తారు. అదే సమయంలో ఇందుకు తను ప్రగ్నెంట్ అని అనుమానం వస్తుంది. ఇంట్లో చెప్పలేక, లేచిపోయి పెళ్లి చేసుకోలేక వరుణ్ – ఇందు మధ్య ఓ గొడవ అవుతుంది.

ఇక మూడో కథలో.. కార్తీక్(కార్తీక్ రత్నం) లైఫ్ లో సక్సెస్ అవ్వలేదని మందు, సిగరెట్, గంజాయికి అలవాటు పడతాడు. ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతాడు. అనుకోకుండా కార్తీక్ తమ్ముడు మొక్కలతో ఓ సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందులో ఉన్న గంజాయి మొక్కలు పోలీసులకు కనపడి వాళ్ళ ఇంటికి వెళ్తారు. పోలీసుల భయంతో కార్తీక్ ఆ గంజాయి మొక్కలను తీసుకొని పారిపోతాడు. కార్తీక్ తండ్రి అతన్ని ఎలాగైనా బాగుచేయాలని ట్రై చేస్తాడు. మరోవైపు పోలీసులు కార్తీక్ కోసం వెతుకుతూ ఉంటారు.

మరి ఈ మూడు కథలకు ఏమైనా సంబంధం ఉందా? శివ మళ్ళీ ఫ్లెక్సీ వేయించాడా? శివ వేరే గ్యాంగ్ తో గొడవ పెట్టుకుంటాడా? ఇందు – వరుణ్ లు ఒక్కటవుతారా? ఇందు ప్రేమ విషయం ఇంట్లో చెప్తుందా? కార్తీక్ పోలీసులకు దొరుకుతాడా? కార్తీక్ మాములు మనిషిగా మారతాడా అనేది తెరపై చూడాల్సిందే.

Also Read : ఏడేళ్ల పాటు హీరోయిన్ నంబ‌ర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా?

సినిమా విశ్లేషణ..
మూడు కథలతో ఆంథాలజీ జానర్ లో ఈ సినిమాని తెరకెక్కించారు. మూడు కథలు ఒకేసారి సాగుతుంటాయి. ఈ మూడు కథలకు ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వకుండా స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కి అసలు ఈ మూడు కథలేంటి? ఎందుకు అనే క్లారిటీ వచ్చేస్తుంది. సినిమాలో కామెడీతో మాత్రం మెప్పించారు. కొన్నిచోట్ల ఫుల్ గా నవ్వుకోవచ్చు. క్లైమాక్స్ లో ఎమోషన్ ని వర్కౌట్ చేయాలని చూసారు కానీ క్లైమాక్స్ ఏదో నాలుగు మంచి మాటలు చెప్పి సడెన్ గా అయిపోయింది అనిపిస్తుంది. క్లైమాక్స్ ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగుండేది.

అలాగే కార్తీక్ అసలు ఎందుకు అలా తయారయ్యాడు అనేది ఇంకొంచెం క్లారిటీ ఇస్తే బాగుండేది. మనిషి సమాజాన్ని చూస్తూ వేరే వాళ్ళతో తనని పోల్చుకుంటూ గొప్పలకు పోతాడని, ఉన్నదాంట్లో బతకడానికి ఇష్టపడడు అని, లైఫ్ లో మనకి నచ్చినవి కావాలంటే ధైర్యం చేయాలని, ఫెయిల్ అయినా వదిలేయకుండా మళ్ళీ ప్రయత్నించాలని ఓ మంచి కథతో శ్రీరంగనీతులు తెరకెక్కించారు.

నటీనటులు పర్ఫార్మెన్స్..
సుహాస్ ఇప్పటికే తన నటనతో మెప్పించి వరుస హిట్స్ కొట్టాడు. ఈ సినిమాలో కూడా అందరికి గొప్పగా కనిపించాలనే ఓ బస్తి కుర్రాడిగా నటించి మెప్పించాడు. విరాజ్ భయస్తురాలైన గర్ల్ ఫ్రెండ్ ని భరించే పాత్రలో ఒదిగిపోయాడు. రుహాణి శర్మ ఇంట్లో ప్రేమ విషయం చెప్పాలంటే భయపడే సాధారణ అమ్మాయిలా మెప్పించింది. వ్యసనాలకు అలవాటు పడిన వ్యక్తిగా కార్తీక్ రత్నం కూడా ఓకే అనిపించాడు. తనికెళ్ళ భరణి, దేవీప్రసాద్, హర్షవర్ధన్, జీవన్, రాజ్ మయూర్.. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక అంశాలు..
ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సన్నివేశానికి తగ్గట్టు బాగా కుదిరింది. పాటలు మాత్రం పర్వాలేదనిపించాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ ఏ కథకు తగ్గట్టు ఆ కథకు చక్కగా కుదిరాయి. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి . కామెడీ ట్రాక్ ని రియాలిటీగా రాసుకున్నారు. మనిషి మనిషిలా బతకాలి అనే ఓ మంచి పాయింట్ తో మూడు కథలను ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ప్రేక్షకులకు చూపించడంలో దర్శకుడు ప్రవీణ్ కుమార్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు కూడా కథకు తగ్గట్టు ఖర్చు పెట్టారు.

మొత్తంగా ‘శ్రీరంగనీతులు’ సినిమాలో జీవితం గురించి, జీవితంలో ఎలా ఉండాలి అని మూడు కథలతో చక్కగా చూపించారు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.