Writer Padmabhushan : జనాల్ని రప్పించడానికి సుహాస్ మంచి ప్లాన్ వేశాడుగా.. రైటర్ పద్మభూషణ్ టికెట్ రేట్లు ఎంతో తెలుసా??

సుహాస్ హీరోగా చేసిన రైటర్ పద్మభూషణ్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 3న థియేటర్స్ లోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులని మెప్పించాయి. సరదాగా సాగే కథతో రాబోతున్న ఈ సినిమా కోసం...............

Writer Padmabhushan : జనాల్ని రప్పించడానికి సుహాస్ మంచి ప్లాన్ వేశాడుగా.. రైటర్ పద్మభూషణ్ టికెట్ రేట్లు ఎంతో తెలుసా??

Suhas Writer Padmabhushan Movie ticket rates finalized

Updated On : January 31, 2023 / 1:24 PM IST

Writer Padmabhushan :  షార్ట్ ఫిలిమ్స్ తో మొదలుపెట్టి, యూట్యూబ్ లో వీడియోలు తీసుకుంటూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు సుహాస్. షార్ట్ ఫిలిమ్స్ నుంచే తన ట్యాలెంట్ తో అందర్నీ మెప్పించి ఫేమస్ అయ్యాడు. లాక్ డౌన్ సమయంలో కలర్ ఫోటో సినిమాతో హీరోగా వచ్చి ఓటీటీలో భారీ విజయం సాధించి, నేషనల్ అవార్డు కూడా కొట్టి ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం సుహాస్ హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

సుహాస్ హీరోగా చేసిన రైటర్ పద్మభూషణ్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 3న థియేటర్స్ లోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులని మెప్పించాయి. సరదాగా సాగే కథతో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకి మరింత మంది ప్రేక్షకులని రప్పించడానికి చిత్రయూనిట్ తమ సినిమాకి టికెట్ రేట్లు తగ్గించింది.

Siddhu Jonnalagadda : బుట్టబొమ్మ కోసం రాబోతున్న డీజే టిల్లు..

ఇటీవల సినిమా టికెట్ రేట్లు పెరిగిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలకి అయితే థియేటర్ ని బట్టి 200 నుండి 300 వరకు టికెట్ రేట్లు ఉన్నాయి. దీనివల్ల ప్రేక్షకులు కూడా తగ్గారు. అందుకే రైటర్ పద్మభూషణ్ ఎలాగో చిన్న సినిమా కావడంతో టికెట్ రేట్లు కొద్దిగా తగ్గించి ప్రేక్షకులని రప్పంచడానికి ట్రై చేస్తుంది. తెలంగాణాలో గరిష్టంగా సింగిల్ స్క్రీన్స్ లో 110 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 150 రూపాయలు టికెట్ రెట్లని పెట్టారు. ఏపీలో గరిష్టంగా సింగిల్ స్క్రీన్స్ లో 110 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 177 రూపాయలు టికెట్ రెట్లని పెట్టారు. దీంతో ప్రేక్షకులు వచ్చి కలెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రేట్లని అధికారికంగా చిత్రయూనిట్ ప్రకటించింది.