Sundeep Kishan : సందీప్ కిషన్ చేతుల మీదుగా ‘హ్రీం’ సినిమా ఓపెనింగ్..

నేడు ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించారు.

Sundeep Kishan : సందీప్ కిషన్ చేతుల మీదుగా ‘హ్రీం’ సినిమా ఓపెనింగ్..

Sundeep Kishan

Updated On : July 31, 2025 / 8:56 PM IST

Sundeep Kishan : పవన్‌ తాత, చమిందా వర్మ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘హ్రీం’. శివమ్‌ మీడియా బ్యానర్ పై శ్రీమతి సుజాత సమర్పణలో శివమల్లాల నిర్మాణంలో రాజేశ్‌ రావూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నేడు ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించారు.

హీరో సందీప్‌కిషన్‌ హీరో హీరోయిన్స్ మీద క్లాప్‌ కొట్టగా అలీ, బెనర్జీ, విజయేంద్రరెడ్డి, రాంబాబు పర్వతనేనిలు స్క్రిప్ట్‌ని అందించారు. రాజీవ్‌ కనకాల కెమెరా స్విచ్చాన్ చేశారు.

Also Read : Mayasabha : ‘మయసభ’ ట్రైలర్ రిలీజ్.. సాయి దుర్గ చేతుల మీదుగా.. ఇదేదో భారీ పొలిటికల్ సిరీస్ లా ఉందే..

సినిమా ఓపెనింగ్ అనంతరం సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ.. నా మొదటి సినిమా నుంచి ఈ సినిమా నిర్మాతతో పరిచయం ఉంది. నాకున్న అతికొద్ది మంది మీడియా ఫ్రెండ్స్‌లో శివ మల్లాల ఒకరు. ఆయన తీస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని అన్నారు. నటుడు అలీ మాట్లాడుతూ.. హ్రీం సినిమా నిర్మాతలు శివమల్లాల, సుజాతలు నాకు కుటుంబ సభ్యులు. వారు నిర్మిస్తున్న ఈ సినిమా హిట్ అవ్వాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా అన్నారు.

Sundeep Kishan Opened Hreem Movie

 

రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాను. హ్రీం సినిమా హీరోయిన్‌ చమిందా వర్మ నటే కాదు. దుబాయ్‌ నుండి తెలుగులో నటించటానికి వచ్చిన తెలుగమ్మాయి, డాక్టర్‌ కూడా. ఇప్పుడు నాకు 50 ఏళ్లు. నాకు 25 ఏళ్లున్నప్పటినుండి ఈ సినిమా నిర్మాత శివ మల్లాల తెలుసు అని అన్నారు.

Also Read : Kingdom : కింగ్డమ్ సక్సెస్ ఈవెంట్ అక్కడే.. ఎప్పుడంటే..?