Dhanush 50th Movie : ధనుష్ దర్శకత్వంలో సందీప్ కిషన్? అది కూడా ధనుష్ 50వ సినిమాలో..

ధనుష్ 50వ సినిమా ఇప్పటికే సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఉంటుందని ప్రకటించారు. ఈ సినిమాలో విష్ణు విశాల్, SJ సూర్యలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని ధనుష్ డైరెక్ట్ చేయబోతున్నాడు.

Dhanush 50th Movie : ధనుష్ దర్శకత్వంలో సందీప్ కిషన్? అది కూడా ధనుష్ 50వ సినిమాలో..

Sundeep Kishan will act in Dhanush 50th Movie

Sundeep Kishan :  తమిళ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) ప్రస్తుతం వరుస హిట్ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలే తెలుగు, తమిళ్ లో సార్(Sir) సినిమాతో వచ్చి భారీ విజయం సాధించాడు ధనుష్. ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ సినిమా ఉంది. అనంతరం ధనుష్ 50వ సినిమా రానుంది.

ధనుష్ 50వ సినిమా ఇప్పటికే సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఉంటుందని ప్రకటించారు. ఈ సినిమాలో విష్ణు విశాల్, SJ సూర్యలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని ధనుష్ డైరెక్ట్ చేయబోతున్నాడు. డైరెక్టర్ గా ఇది ధనుష్ కి రెండో సినిమా కానుంది. ధనుష్ డైరెక్ట్ చేయడం, ధనుష్ కి 50వ సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు రాయన్ అనే టైటిల్ ని అనుకుంటున్నట్టు సమాచారం.

అయితే ధనుష్ 50వ సినిమాలో సందీప్ కిషన్ కూడా ఓ ముఖ్య పాత్ర చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. సందీప్ కిషన్ గతంలో తమిళ్ లో కొన్ని డైరెక్ట్ సినిమాలు చేశాడు. సందీప్ కిషన్ పలు తెలుగు సినిమాలు కూడా తమిళ్ లో డబ్ అయి రిలీజ్ అయ్యాయి. సందీప్ కి తమిళ్ లో కూడా ఎంతో కొంత మార్కెట్ ఉంది. సందీప్ చివరిసారిగా మైఖేల్ సినిమాలో నటించగా ఇది తమిళ్, తెలుగులో రిలీజయింది. అయితే ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. ఈ సినిమా టిజర్ ని ధనుష్ లాంచ్ చేశారు.

Memu Famous Twitter Review : మేము ఫేమస్ ట్విట్టర్ రివ్యూ.. యూత్ కచ్చితంగా ఈ సినిమా చూడాలంట..

ప్రస్తుతం సందీప్ కిషన్ ధనుష్ హీరోగా చేస్తున్న కెప్టెన్ మిల్లర్ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. ఇప్పుడు ధనుష్ 50వ సినిమాలో కూడా సందీప్ కిషన్ నటించబోతున్నట్టు సమాచారం. దీంతో సందీప్ కిషన్ లక్ మాములుగా లేదుగా వెంటవెంటనే ధనుష్ సినిమాలో ఛాన్సులు, అది కూడా ధనుష్ డైరెక్షన్ చేసే సినిమాలో ఛాన్స్ వచ్చింది అని అనుకుంటున్నారు. ఈ సినిమాలతో సందీప్ కి తమిళ్ లో మరింత మార్కెట్ పెరిగే అవకాశం ఉంది.