Fighter Siva : సునీల్ కీలక పాత్రలో ఫైటర్ శివ.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంపత్ నంది..
ఈ సినిమాలో సునీల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Fighter Siva
Fighter Siva : అరుణగిరి ఆర్ట్స్, కౌండిన్య ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నర్సింహ, ఉన్నం రమేష్ నిర్మాణంలో ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఫైటర్ శివ’. మణికంఠ – ఐరా బన్సాల్ జంటగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సునీల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో వికాస్ వశిష్ట, మధుసూదన్, యోగి కాట్రి, దిల్ రమేష్, లక్ష్మణ్, అభయ్, ఆనంద్ భారతి, ఘర్షణ శ్రీనివాస్, మాస్టర్ శన్విత్ నిమ్మల.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. డైరెక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా ఫైటర్ శివ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.
Also Read : Shobha Shetty : ఆడిషన్ కి రమ్మంటే పాస్‌పోర్ట్ ఫొటోలు తీసుకెళ్లా.. నా ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతంటే..?