Roja – Hyper Aadi : నాగబాబు వచ్చి రోజా రాకపోవడంతో.. రోజా కటౌట్ పెట్టి హైపర్ ఆది ఏం చేసాడో తెలుసా? ప్రోమో వైరల్..

తాజాగా జబర్దస్త్ 12 ఏళ్ళ స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు.

Roja – Hyper Aadi : నాగబాబు వచ్చి రోజా రాకపోవడంతో.. రోజా కటౌట్ పెట్టి హైపర్ ఆది ఏం చేసాడో తెలుసా? ప్రోమో వైరల్..

Roja - Hyper Aadi

Updated On : July 27, 2025 / 1:04 PM IST

Roja – Hyper Aadi : జబర్దస్త్ 12 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఓ స్పెషల్ ఎపిసోడ్ చేసారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ కి నాగబాబు కూడా వచ్చారు. జబర్దస్త్ మొదలుపెట్టినప్పటి నుంచి నాగబాబు, రోజా జడ్జీలుగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ధనరాజ్, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చంటి.. ఇలా పాత టీమ్ లీడర్లు, పాత యాంకర్లు అనసూయ, సౌమ్య కూడా హాజరయ్యారు. వీరంతా హాజరవ్వగా రోజా మాత్రం రాలేదు.

రోజా ఆల్రెడీ జీ తెలుగులో డ్రామా జూనియర్స్ షోకి జడ్జిగా చేస్తుంది. దీంతో ఈ జబర్దస్త్ స్పెషల్ సెలెబ్రేషన్స్ కి వస్తుంది అనుకున్నారు కానీ రాలేదు. అయితే గతంలో పాలిటిక్స్ పరంగా రోజాకి నాగబాబుకి, హైపర్ ఆదికి, జబర్దస్త్ లో పలువురికి విబేధాలు వచ్చాయి. జబర్దస్త్ లో ఉన్న వాళ్లంతా జనసేనకు సపోర్ట్ చేయడం, రోజా వైసిపి అవ్వడంతో వారి మధ్య విబేధాలు వచ్చాయని రూమర్స్ ఉన్నాయి. కొంతమంది అయితే రోజాని పొలిటికల్ పరంగా విమర్శించారు. అందుకే రోజా ఇప్పుడు జబర్దస్త్ ఎపిసోడ్ కి రాలేదేమో అనుకుంటున్నారు.

Also Read : Shobha Shetty : ఆడిషన్ కి రమ్మంటే పాస్‌పోర్ట్ ఫొటోలు తీసుకెళ్లా.. నా ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతంటే..?

తాజాగా జబర్దస్త్ 12 ఏళ్ళ స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో హైపర్ ఆది స్కిట్ వైరల్ అవుతుంది.

రోజా రాకపోవడంతో హైపర్ ఆది రోజా కటౌట్ తీసుకొచ్చి ఓ చిన్న స్కిట్ చేసాడు. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయశాంతి – చిరంజీవి మాట్లాడుకున్న మాటలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అవే మాటలు రోజా కటౌట్ తో మాట్లాడాడు ఆది. నేనెప్పుడూ మిమ్మల్ని విమర్శించలేదు. మీరెందుకు నన్ను విమర్శించారు పొలిటికల్ పరంగా అంటూ కామెడీగా కౌంటర్లు వేసాడు. కానీ నాగబాబు లాగే రోజా కూడా మాకు బాగా సపోర్ట్ చేసింది అన్నారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. మరి ఈ ప్రోమో చూసి రోజా ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.

మీరు కూడా జబర్దస్త్ 12 ఏళ్ళ స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో చూసేయండి..

 

Also Read : Shobha Shetty : మా నాన్నని మోసం చేసారు.. అమ్మ బంగారు తాళి అమ్మి డబ్బులు తెస్తే ఆడిషన్స్ కి వెళ్ళాను..