సీఎంలుగా సూపర్ స్టార్స్.. వైరల్ అవుతున్న పిక్స్..

  • Published By: Mahesh ,Published On : April 29, 2020 / 01:26 PM IST
సీఎంలుగా సూపర్ స్టార్స్.. వైరల్ అవుతున్న పిక్స్..

Updated On : April 29, 2020 / 1:26 PM IST

నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ, ఈ జనరేషన్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు వెండితెరపై ముఖ్యమంత్రులుగా కనిపించిన సినిమాల గురించిన వార్తలు, వాటి తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కృష్ణ హీరోగా విజయ నిర్మల దర్శకత్వంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టి.అంజయ్య తనయుడు టి.శ్రీనివాస రెడ్డి నిర్మించిన చిత్రం ‘ముఖ్యమంత్రి’. 1984 ఏప్రిల్ 27న విడుదలైన ఈ చిత్రం 2020 ఏప్రిల్ 27 నాటికి 36 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.

అలాగే మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ సీఎంగా ‘భరత్ అనే నేను’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2018 ఏప్రిల్ 20న విడుదలైంది. సంవత్సరాలు వేరైనా విడుదలైంది మాత్రం ఏప్రిల్ నెలలోనే కావడం, పైగా తండ్రీ కొడుకులు, రెండు జెనరేషన్ల సూపర్ స్టార్లు అయిన కృష్ణ, మహేష్ ఇద్దరూ కూడా ముఖ్యమంత్రి పాత్ర పోషించి ప్రేక్షకాభిమానులను మెప్పించడం విశేషం.