Mahesh Babu : గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ ఆడియో లీక్.. ఆ సినిమాలోని పాటేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న 'గుంటూరు కారం' సినిమా నుంచి 'మసాలా బిర్యానీ' అంటూ ఫస్ట్ సాంగ్ ఆడియో క్లిప్ లీక్ అయ్యింది. ఇది నిజంగానే ఆ సినిమాలోని పాటేనా? లేక..

Mahesh Babu : గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ ఆడియో లీక్.. ఆ సినిమాలోని పాటేనా?

Mahesh Babu

Updated On : November 4, 2023 / 11:14 AM IST

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా టీజర్ రిలీజై 5 నెలలు అయిపోతోంది. ఈ సినిమా గురించి కొత్తగా ఏ అప్ డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త కోపంలో కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి పాట లీకైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘మసాలా బిర్యానీ’ అంటూ సాగే పాట క్లిప్‌పై ఫ్యాన్స్ మాత్రం పెదవి విరుస్తున్నారు. ఇంతకీ ఇది ఆ సినిమాలోని పాటేనా?

Akshara Haasan : లగ్జరీ అపార్ట్‌మెంట్ కొన్న కమల్ హాసన్ చిన్న కూతురు.. కాస్ట్ ఎంతో తెలుసా?

మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘గుంటూరు కారం’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ ఫ్యాన్స్‌కి విపరీతమైన కిక్ ఇచ్చింది. ఈ మూవీ నెక్ట్స్ అప్ డేట్ ఏం వస్తుందా? అని మహేష్ అభిమానులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. 5 నెలలు గడుస్తున్నా ఒక్క పాట కూడా రిలీజ్ కాలేదు. మహేష్ బాబు పుట్టినరోజుకి అయినా ఫస్ట్ సాంగ్ ఉంటుందనుకున్న ఫ్యాన్స్‌కి నిరాశే ఎదురైంది.

ఫస్ట్ సాంగ్ ఈ వారంలో రిలీజ్ చేస్తామని రెండు రోజుల క్రితం నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రెస్ మీట్‌లో చెప్పారు. సినిమా సంక్రాంతికి తప్పకుండా రిలీజ్ అవుతుందని స్పష్టం చేశారు. అయితే రీసెంట్‌గా ఈ సినిమా నుంచి పాట లీకైందని అంటున్నారు. ఓ చిన్న ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మసాలా బిర్యానీ’ అంటూ సాగిన క్లిప్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంది. ఈ క్లిప్‌ను ఫ్యాన్స్ తెగ షేర్ చేసుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం నిరాశకు లోనయ్యారు. థమన్ గతంలో ఇచ్చిన పాటల మాదిరిగానే ఉందని పెదవి విరిచారు. ఈ ఆడియో లీక్ థమన్ కావాలని చేసిన పని అని కూడా కొందరు భావిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే నిజంగానే ఇది ‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిలేనా? కాదా? తేలాలంటే వెయిట్ చేయాల్సిందే.

Kingdom of the Planet of the Apes : ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ కొత్త సినిమా ట్రైలర్ చూశారా..?

‘గుంటూరు కారం’ మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను భారీ స్ధాయిలో నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా జనవరి 12 న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ సిద్ధమవుతోంది.