Rajinikanth : రజినీకాంత్‌కు స్వల్ప అస్వస్థత..!

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య కారణాలతో ఆయన చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు.

Rajinikanth : రజినీకాంత్‌కు స్వల్ప అస్వస్థత..!

Superstar Rajinikanth Hospitalised In Chennai

Updated On : October 28, 2021 / 10:22 PM IST

Superstar Rajinikanth : సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య కారణాలతో ఆయన అక్టోబర్ 28 (గురువారం) సాయంత్రం చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. రొటీన్ చెక్అప్‌లో భాగంగానే రజినీ ఆస్పత్రిలో చేరినట్టు ఆయన భార్య లత రజినీకాంత్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రజినీకాంత్ చికిత్స తీసుకుంటుండగా ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. కానీ, ఆరోగ్యంపై పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది.
Aryan khan : ఆర్యన్ ఏం చేయబోతున్నాడు? షారుఖ్, గౌరీ ఖాన్‌కు ఉన్న ప్లానేంటి?

ఇటీవలే రజినీకాంత్ ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఢిల్లీ వెళ్లి ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు చేతుల మీదుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. కానీ, ఇంతలోనే రజినీ అస్వస్థతకు గురికావడం ఆయన ఫ్యాన్స్‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రజినీకాంత్ పెద్దన్న సినిమాను త్వరగా పూర్తి చేయాలనుకున్నారు. ఆయనకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. డాక్టర్స్ టెన్షన్స్‌కు దూరంగా ఉండాలని సూచించడంతో తలైవా రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పేశారు. చాలా రోజులు రెస్ట్ తీసుకుని మళ్లీ పెద్దన్న మూవీని పూర్తి చేశారు.

రజినీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ మూవీలో తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో రిలీజ్ కు రెడీగా ఉంది. దీపావళి పండుగ సందర్భంగా రజినీ మూవీ నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ‘రా సామీ’ అంటూ సాగే పవర్‌ఫుల్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. పెద్దన్న ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో ఖుష్బూ, మీనా, నయనతార హీరోయిన్స్‌గా నటించగా.. మరో హీరోయిన్ కీర్తి సురేశ్ రజినీకాంత్ చెల్లెలుగా కనిపించనుంది.
Devi Sri-Thaman: చేయి పడితే సినిమా హిట్టే.. థమన్ దేవీల మధ్య టఫ్ ఫైట్!