Jai Bhim Teaser : దొంగలకు కూడా జాతి ఉంటుందా..
సూర్య, జ్యోతిక కలిసి నిర్మిస్తున్న ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘జై భీమ్’ టీజర్ ఆకట్టుకుంటోంది..

Jai Bhim Teaser
Jai Bhim Teaser: వెర్సటైల్ యాక్టర్ సూర్య వరుస సినిమాలతో అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. ‘ఆకాశం నీ హద్దురా’ తో ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న సూర్య.. కంటెంట్ ఓరియంటెడ్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ తన స్టైల్లో దూసుకెళ్తున్నారు.
Allu Arjun : ఈ బుల్లెట్ మీద ఎన్ని చలాన్లు ఉన్నాయో తెలుసా
సూర్య 39వ సినిమా ‘జై భీమ్’.. 2 డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, రజీషా విజయన్, మణికందన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. దసరా కానుకగా ‘జై భీమ్’ తెలుగు, తమిళ్ టీజర్స్ రిలీజ్ చేశారు.
NANI 29 : ఈ దసరా నిరుడు లెక్క ఉండదు..
తమ భూముల కోసం పోరాడే పేదల తరపున అండగా నిలబడే పవర్‌ఫుల్ లాయర్‌గా సూర్య కనిపించనున్నారు. టీజర్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి. డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ ద్వారా ‘జై భీమ్’ విడుదల కానుంది.