Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ ది హత్యే.. పోస్టుమార్టం స్టాఫ్ సంచలన కామెంట్స్!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి రెండేళ్లు దాటినా, అతడి మృతికి గల అసలు కారణాలు ఏమిటనే క్లారిటీ మాత్రం లేదు. ఆయన మృతిపట్ల పలు అనుమానాలు రేకెత్తుతున్నా, పోలీసులు మాత్రం ఆయనది ఆత్మహత్య అంటూ తమ నివేదికలో తెలియజేశారు. కానీ, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి తాజాగా ఓ వ్యక్తి చేస్తున్న ఆరోపణలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ ది హత్యే.. పోస్టుమార్టం స్టాఫ్ సంచలన కామెంట్స్!

Sushant Singh Rajput Was Murdered Says Postmortem Staff

Updated On : December 27, 2022 / 11:02 AM IST

Sushant Singh Rajput: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి రెండేళ్లు దాటినా, అతడి మృతికి గల అసలు కారణాలు ఏమిటనే క్లారిటీ మాత్రం లేదు. ఆయన మృతిపట్ల పలు అనుమానాలు రేకెత్తుతున్నా, పోలీసులు మాత్రం ఆయనది ఆత్మహత్య అంటూ తమ నివేదికలో తెలియజేశారు. కానీ, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి తాజాగా ఓ వ్యక్తి చేస్తున్న ఆరోపణలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

Sushant Singh Rajput Flat : సుశాంత్ ఇల్లా..! అమ్మో అంటున్నారు.. చనిపోయి రెండున్నరేళ్లు అవుతున్నా ఇంకా ఎవరూ అద్దెకు రాలేదు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించిన బృందంలోని ఓ వ్యక్తి ఆయనది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికి హత్యే అని ఆరోపణలు చేస్తున్నాడు. కూపర్ ఆసుపత్రిలో సుశాంత్ సింగ్ పోస్టుమార్టం నిర్వహించిన బృందంలో రూప్‌కుమార్ షా అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన తాజాగా సుశాంత్ మరణంపై పలు సంచలన కామెంట్స్ చేశారు. సుశాంత్ సింగ్ పోస్టుమార్టం చేసే సమయంలో సీనియర్లతో పాటు రూప్‌కుమార్ కూడా ఉన్నారని.. ఆయన సుశాంత్ బాడీని చూడగానే ఆయన్ని గుర్తుపట్టానని చెప్పుకొచ్చాడు. అంతేగాక, సుశాంత్ బాడీపై పలు గాయాలు ఉన్నాయని ఆయన గుర్తించాడట.

Sushant Singh relatives Dead : రోడ్డు ప్రమాదంలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

పోస్టుమార్టం జరిగేటప్పుడు వీడియో రికార్డు చేయాలి. కానీ, తమ పైఅధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కేవలం ఫొటోలు మాత్రమే తీశామని రూప్‌కుమార్ తెలిపారు. వీలైనంత త్వరగా సుశాంత్ సింగ్ బాడీని పోలీసులకు అప్పగించాలని తమ సీనియర్లు ఆదేశించడంతో రాత్రిపూటే పోస్టుమార్టం చేశామని రూప్‌కుమార్ తాజాగా వెల్లడించారు. దీంతో ఇప్పుడు రూప్‌కుమార్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. మరి ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయా అని అభిమానులు చూస్తున్నారు.