Swathi Reddy : నవీన్ చంద్ర మాటలకు ఏడ్చేసిన కలర్స్ స్వాతి..!
నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి జంటగా నటిస్తున్న సినిమా మంత్ ఆఫ్ మధు. ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ స్వాతిపై హీరో నవీన్ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నవీన్ చంద్ర మాటలు విన్న స్వాతి భావోద్వేగానికి లోనైంది.

Swathi Reddy Gets Emotional
Swathi Reddy Gets Emotional : నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి జంటగా నటిస్తున్న సినిమా మంత్ ఆఫ్ మధు. శ్రీకాంత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అక్టోబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో చిత్ర బృందం పాల్గొంటుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ స్వాతిపై హీరో నవీన్ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నవీన్ చంద్ర మాటలు విన్న స్వాతి భావోద్వేగానికి లోనైంది.
అసలు నవీన్ చంద్ర ఏం మాట్లాడాడు అంటే.. ?
మంత్ ఆఫ్ మధు చిత్రంలో లేఖ క్యారెక్టర్ చేయాలంటే చాలా గడ్స్ కావాలన్నారు. ‘మా సిస్టర్ జాబ్ చేస్తుంటుంది. ఆమె రోజు బస్సు, ఆటో, మెట్రోలో ప్రయాణం చేస్తుంటుంది. ఆమె తన కుటుంబం కోసం చాలా కష్టపడాలి. అలాగే స్వాతి కూడా చాలా హార్డ్ వర్క్ చేసే పర్సన్. ‘అని నవీన్ చంద్ర అన్నాడు. స్వాతిని ఫ్యామిలీ మెంబర్‌గానే చూస్తానని చెప్పాడు. ఆమె కష్టపడడమే కాకుండా తనతో పనిచేసే వారిలో నమ్మకాన్ని కలిగిస్తుందన్నాడు.
Siddharth : నాకు నంది అవార్డు రాలేదు.. తెలుగులో ఇక సినిమాలు రిలీజ్ చేయను..
భగవంతుడిని ఇంతకు మించి ఏమీ అగలేనని, నా బెస్ట్ ఫ్రెండ్ స్వాతి అని నవీన్ చెప్పాడు. భవిష్యత్తులోనూ ఏదైన అవకాశం వస్తే తామిద్దరం కలిసి నటించేందుకు సిద్ధం అని తెలిపాడు. ఇక తమ జోడీని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ మాటలు విన్న స్వాతి భావోద్వేగానికి లోనైంది. స్టేజీ పైన ఉన్నప్పటికీ కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. తనను ఇంతలా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అంటూ ఎమోషనలైంది.