Bigg Boss 5 Telugu : శ్వేత వర్మ ఆవేశాన్ని ఆపడం ఎవరి వల్లా కాలేదు..
ఎప్పుడూ కూల్‌గా కనిపించే శ్వేత వర్మ కాళికా అవతారమెత్తింది.. లోబో, హమీదా ఫేక్ అంటూ వారిపై విరుచుకు పడింది..

Swetaa Varma
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 రోజు రోజుకీ మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. కంటెస్టెంట్స్ ఒకరిని మించి మరొకరు రచ్చ రంబోలా చేస్తున్నారు. 19 మందిలో ముందుగా సరయు ఎలిమినేట్ అయ్యింది. దీంతో 18 మంది సభ్యుల మధ్య జరిగే సోమవారం ఎపిసోడ్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ షాకింగ్ డెసిషన్..?
ఎందుకుంటే.. ఈ ఎపిసోడ్‌లో నామినేషన్స్ అసలైన హైలెట్.. దీంతో కంటెస్టెంట్లు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నప్పటికీ.. ఒక్కొక్కరి నిజ స్వరూపాలు బయట పడతాయి. మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా ఓవర్‌గా రియాక్ట్ అయిపోతుంటారు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో శ్వేత వర్మ ఓ రేంజ్‌లో రచ్చ చెయ్యబోతోందని ప్రోమో చూస్తే అర్థమవుతుంది.
Samantha : ‘లవ్ స్టోరీ’ ట్రైలర్‌పై సమంత రియాక్షన్.. డిఫరెన్స్ గమనించారా..?
ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు. అయితే కూల్‌గా కనిపించే శ్వేత కాళికా అవతారమెత్తింది. కంటెస్టెంట్లను కడిగి పారేసింది. లోబో, హమీదా ఫేక్ అంటూ వారిపై విరుచుకు పడింది. వారిని నామినేట్ చేసింది. ఆమె కోపాన్ని కంట్రోల్ చెయ్యడం ఎవరి వల్లా కాలేదని తెలుస్తోంది. దీంతో సోమవారం ఎపిసోడ్‌పై ఎగ్జైట్‌మెంట్ నెలకొంది..