Demon : మరో తమిళ్ హారర్ సినిమా.. డబ్బింగ్ తో తెలుగు ఓటీటీలో..
తమిళ్ లో హిట్ అయిన హారర్ థ్రిల్లర్ 'డీమన్' సినిమా తెలుగులో డబ్బింగ్ అయింది.

Tamil Horror Movie Demon Dubbed and Streaming in Aha OTT
Demon : ఇటీవల మలయాళం, తమిళ్ లో సూపర్ హిట్ అయిన సినిమాలను డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలను డైరెక్ట్ ఓటీటీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళ్ లో హిట్ అయిన హారర్ థ్రిల్లర్ ‘డీమన్’ సినిమా తెలుగులో డబ్బింగ్ అయింది.
Also Read : HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రిలీజ్ ఆ రోజునే.. ఫ్యాన్స్ గెట్ రెడీ..
డీమన్ సినిమా తెలుగు ఓటీటీ ఆహాలో రేపు మే 30 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. భవాని మీడియా ద్వారా ఆహా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. రమేశ్ పళనీవేల్ దర్శకత్వంలో, నిర్మాత ఆర్. సోమసుందరం నిర్మాణంలో సచిన్ మణి , అబర్నతి ప్రధాన పాత్రల్లో, సురుతి పేరియసామి, కుంకి అశ్విన్, రవీనా.. పలువురు కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది.
హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన డీమన్ సినిమా ఆహా ఓటీటీలో చూసేయండి.