Tamil Stars : అయ్యప్పమాలలో శబరిమలకు బయలుదేరిన తమిళ స్టార్లు..
ఆంధ్రాతో పాటు తమిళనాడులో కూడా అయ్యప్ప భక్తులు ఎక్కువగా ఉంటారన్న సంగతి తెలిసిందే. పలువురు తమిళ స్టార్స్ కూడా అయ్యప్ప మాల వేసుకుంటారు. గతంలో కొంతమంది తమిళ సినీ ప్రముఖులు అయ్యప్ప మాల వేసుకొని కనిపించారు. తాజాగా..................

Tamil Stars going to sabarimala in ayyappa mala
Tamil Stars : చాలా మంది స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు కూడా అయ్యప్ప మల వేసుకుంటారన్న సంగతి తెలిసిందే. మన తెలుగులోనే చిరంజీవి, రామ్ చరణ్, శర్వానంద్, మోహన్ బాబు.. ఇలా చాలామంది సినీ హీరోలు, ప్రముఖులు అయ్యప్ప మల వేసుకొని శబరిమల వెళ్లి వస్తూ ఉంటారు. మన టాలీవుడ్ లోనే కాక బయట సినీ పరిశ్రమలో కూడా పలువురు ప్రముఖులు అయ్యప్పమాల వేసుకుంటారు. బాలీవుడ్ లో అజయ్ దేవ్ గణ్, వివేక్ ఒబెరాయ్ లాంటి హీరోలు కొంతమంది వేస్తారు.
ఇక ఆంధ్రాతో పాటు తమిళనాడులో కూడా అయ్యప్ప భక్తులు ఎక్కువగా ఉంటారన్న సంగతి తెలిసిందే. పలువురు తమిళ స్టార్స్ కూడా అయ్యప్ప మాల వేసుకుంటారు. గతంలో కొంతమంది తమిళ సినీ ప్రముఖులు అయ్యప్ప మాల వేసుకొని కనిపించారు. తాజాగా సీనియర్ నటుడు జయరాం, తమిళ హీరో జయం రవి, దర్శకుడు, నయన్ భర్త విగ్నేష్ శివన్ అయ్యప్పమాల ధరించి ఇరుముడులతో శబరిమలకు బయలుదేరారు.
Naatu Naatu song : నాటు నాటు సాంగ్‌ని బాగానే వాడుకుంటున్నారుగా.. జైపూర్ పోలీసుల వినూత్న ప్రమోషన్స్..
వీరు ఇరుముడులు నెత్తిమీద పెట్టుకొని బయలుదేరిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరితో మాటు మరికొంతమంది స్వాములు కూడా ఉన్నారు.
Actor @actor_jayamravi with #Jayaram & @VigneshShivN Got the blessing of Lord Ayyappa ! #JayamRavi @proyuvraaj pic.twitter.com/f5Lo2TmljY
— BA Raju's Team (@baraju_SuperHit) January 14, 2023