Tollywood Stars : ఒకప్పటి టాలీవుడ్ సెన్సేషన్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్ లో.. పాత ఫోటో వైరల్.. ఈ ఫొటో ఎప్పటిదో తెలుసా..?

ఒకప్పుడు ఈ నలుగురు స్టార్స్ వరుస హిట్స్ తో తెలుగులో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Tollywood Stars : ఒకప్పటి టాలీవుడ్ సెన్సేషన్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్ లో.. పాత ఫోటో వైరల్.. ఈ ఫొటో ఎప్పటిదో తెలుసా..?

Tarun Uday Kiran Aarthi Agarwal Sadha Tollywood Stars in One Frame Old Photo goes Viral

Updated On : November 1, 2024 / 5:55 PM IST

Tarun – Uday Kiran – Sadha- Aarthi Agarwal : అప్పుడప్పుడు మన సెలబ్రిటీల పాత ఫొటోలు వైరల్ అవుతాయని తెలిసిందే. తాజాగా ఒకప్పటి టాలీవుడ్ సెన్సేషన్ స్టార్స్ ఉన్న ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో తరుణ్, ఉదయ్ కిరణ్, సదా, ఆర్తి అగర్వాల్ ఉన్నారు. వీరిలో ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ మరణించిన సంగతి తెలిసిందే. ఇక తరుణ్, సదా ఇద్దరూ కూడా ప్రస్తుతం యాక్టివ్ గా లేరు.

Also Read : Kubera : నాగార్జున – ధనుష్ సినిమా ‘కుబేర’ టీజర్ ఎప్పుడో తెలుసా? కొత్త పోస్టర్ రిలీజ్..

అయితే ఒకప్పుడు ఈ నలుగురు స్టార్స్ వరుస హిట్స్ తో తెలుగులో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తరుణ్, ఉదయ్ కిరణ్ అయితే అప్పటి యూత్ కి ఫేవరేట్ హీరోలు, అమ్మాయిల కలల రాకుమారులు. ఆర్తి అగర్వాల్ వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేసి అప్పట్లో స్టార్ హీరోయిన్ అయింది. ఈ ఫోటో 2005లో తీసినట్టు తెలుస్తుంది. తాజాగా ఈ ఫోటోని తీసిన సీనియర్ ఫోటోగ్రాఫర్ ఒకరు షేర్ చేసారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో బోట్ లో వీళ్ళు కూర్చున్నప్పుడు తీసిన ఫోటో అని తెలిపారు.

Tarun Uday Kiran Aarthi Agarwal Sadha Tollywood Stars in One Frame Old Photo goes Viral

2005 లో తరుణ్ – ఆర్తి అగర్వాల్ జంటగా సోగ్గాడు సినిమా, ఉదయ్ కిరణ్ – సదా జంటగా ఔనన్నా కాదన్నా సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు వారం గ్యాప్ తో వచ్చాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ కార్యక్రమంలో వీళ్ళు పాల్గొన్నప్పుడు తీసిన ఫొటో అని తెలుస్తుంది. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవ్వడంతో అభిమానులు, నెటిజన్లు ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. తరుణ్, సదా మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ అవ్వాలని కోరుకుంటున్నారు.