Tasty Teja : తన పక్కన నేను బాగోలేనని వదిలేసింది.. తన లవ్ స్టోరీ చెప్పిన టేస్టీ తేజ.. వచ్చే అమ్మాయికి ఒకటే చెప్తున్నా..
టేస్టీ తేజ తన లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ..

Tasty Teja Reveals his Love Story in Bigg Boss
Tasty Teja : తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకుంది. పలువురు కంటెస్టెంట్స్ ఇప్పటికే ఎలిమినేట్ అవ్వగా నేడు ఆదివారం ఎపిసోడ్ లో మరొకరు ఎలిమినేట్ కానున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ని తమ మొదటి లవ్ స్టోరీల గురించి చెప్పాలని బిగ్ బాస్ అడిగాడు.
దీంతో పలువురు కంటెస్టెంట్స్ తమ మొదటి ప్రేమకథలను చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో టేస్టీ తేజ మాట్లాడుతూ.. నేను, తాను నాలుగేళ్ల పాటు రిలేషన్ లో ఉన్నాము. ఒకసారి ఇంటికెళ్లి రాగానే నాకు బ్రేకప్ చెప్పింది. కారణం అడిగితే తన పక్కన నేను బాగోలేనని వాళ్ళ పేరెంట్స్ వద్దన్నారని చెప్పింది. ఆ తర్వాత ఒకసారి ఆ అమ్మాయి కాల్ చేసి సారీ అంటూ ఏడ్చేసింది. నా లైఫ్ లోకి వచ్చే అమ్మాయికి ఒక్కటే చెప్తున్నా మా అమ్మను ఎంత ప్రేమగా చూసుకుంటానో, తనను కూడా అంతే ప్రేమగా చూసుకుంటాను అని తెలిపాడు. మరి టేస్టీ తేజని వదులుకున్న ఆ అమ్మాయి ఎవరో?