Rajinikanth : రజినీకాంత్ రోడ్డు మీద ఛాయ్ అమ్ముకుంటున్నారా?.. అచ్చు సూపర్ స్టార్ లాగే..

ఇటీవల మలయాళం డైరెక్టర్ నాదిర్ షా పోర్ట్ కొచ్చిన్ కి వెళ్లగా అక్కడ ఓ వ్యక్తి రోడ్డు మీద ఛాయ్ అమ్ముతూ అచ్చం రజినీకాంత్ లాగే కనపడ్డాడు.

Rajinikanth : రజినీకాంత్ రోడ్డు మీద ఛాయ్ అమ్ముకుంటున్నారా?.. అచ్చు సూపర్ స్టార్ లాగే..

Tea Seller looks like Super Star Rajinikanth in Kochi Director Nadhir Shah Shares Photos

Updated On : October 22, 2023 / 6:52 AM IST

Rajinikanth : మనిషిని పోలిన మనుషులు ఉంటారు అంటారు. ఇక మన హీరోలకి, సెలబ్రిటీలకు కొంచెం అటు ఇటు పోలికలు ఉన్నవాళ్లు ఈ మధ్య సోషల్ మీడియాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. వాళ్ళ లుక్స్ చూస్తే అచ్చు మన సెలెబ్రిటీలలాగే కనపడి ఆశ్యర్యపరుస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ లాగే ఉన్న ఓ పెద్దాయన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

ఇటీవల మలయాళం డైరెక్టర్ నాదిర్ షా పోర్ట్ కొచ్చిన్ కి వెళ్లగా అక్కడ ఓ వ్యక్తి రోడ్డు మీద ఛాయ్ అమ్ముతూ అచ్చం రజినీకాంత్ లాగే కనపడ్డాడు. దీంతో నాదిర్ షా ఆశ్చర్యపోయాడు. తెల్ల గడ్డం, బట్టతల, కళ్ళజోడు పెట్టుకొని దూరం నుంచి చూస్తే అచ్చు సూపర్ స్టార్ రజినీకాంత్ లాగే కనపడుతుండటంతో నాదిర్ అతనితో ఫోటో దిగి, అతని ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Also Read : Bigg Boss 7 Day 48 : హౌస్ లో మూడో కెప్టెన్ ఎవరు? కంటెస్టెంట్స్ అందర్నీ ఓ రౌండ్ వేసుకున్న నాగార్జున..

ఇంకేముంది దెబ్బకి ఆ వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. అతని పేరు సుధాకర్ ప్రభు. నాదిర్ షా అచ్చు రజినీకాంత్ లాగే ఉన్న సుధాకర్ ప్రభు ఫోటోలు షేర్ చేయడంతో వార్తల్లో నిలిచాడు ఆ వ్యక్తి. దీంతో ఆ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా అతన్ని చూడటానికి వస్తున్నారట జనాలు. మరి ఇది అతనికి హెల్ప్ అయి మరింత మంచి జీవనం గడిపేలా చేస్తుందేమో చూడాలి.