Bigg Boss 7 Day 48 : హౌస్ లో మూడో కెప్టెన్ ఎవరు? కంటెస్టెంట్స్ అందర్నీ ఓ రౌండ్ వేసుకున్న నాగార్జున..

నిన్న శనివారం వీకెండ్ ఎపిసోడ్ లో వారం అంతా జరిగిన వాటిని గుర్తు చేస్తూ నాగార్జున కాంటెసెంట్స్ అందరికి క్లాస్ పీకాడు. శుక్రవారం ఎపిసోడ్ లో కెప్టెన్సీ ఫైనల్ టాస్క్ దగ్గర ఆగిపోయింది.

Bigg Boss 7 Day 48 : హౌస్ లో మూడో కెప్టెన్ ఎవరు? కంటెస్టెంట్స్ అందర్నీ ఓ రౌండ్ వేసుకున్న నాగార్జున..

Bigg Boss 7 Day 48 Highlights Nagarjuna Fires on Contestants

Updated On : October 22, 2023 / 6:31 AM IST

Bigg Boss 7 Day 48 :  బిగ్‌బాస్ హౌస్ లో ఏడో వారం కూడా పూర్తవ్వొస్తుంది. నిన్న శనివారం వీకెండ్ ఎపిసోడ్ లో వారం అంతా జరిగిన వాటిని గుర్తు చేస్తూ నాగార్జున కాంటెసెంట్స్ అందరికి క్లాస్ పీకాడు. శుక్రవారం ఎపిసోడ్ లో కెప్టెన్సీ ఫైనల్ టాస్క్ దగ్గర ఆగిపోయింది. శనివారం మొదట అర్జున్, సందీప్ చివరి టాస్క్ లో పోటీ పడగా అర్జున్ గెలిచి బిగ్‌బాస్ హౌస్ కి మూడో కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత నాగార్జున హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

కాసేపు అందరికి సరదాగా మాట్లాడి ఆ తర్వాత ఒక్కొక్కరు చేసిన తప్పులు ప్రస్తావిస్తూ క్లాస్ పీకాడు. నామినేషన్స్ లో బూతులు మాట్లాడుతూ హడావిడి చేసిన భోలే శివాలిని తిట్టడంతో ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాను అని చెప్పాడు. అనంతరం ప్రశాంత్ మీద ఫైర్ అయ్యాడు నాగ్. ప్రతి సారి రైతుబిడ్డ అని చెప్పి సింపతీ చూపిస్తున్నాడని, మాటలు మారుస్తున్నాడని డైరెక్ట్ గా చెప్పకుండా హౌస్ లోని కంటెస్టెంట్స్ తో చెప్పించాడు నాగ్. ప్రశాంత్ సందీప్ తనని ఊరోడు అన్నాడని, అది నాకు నచ్చలేదని కవర్ చేయబోగా, నాగార్జున మా నాన్న కూడా ఊరోడే, దానికి నేను గర్వపడుతున్నాను అని చెప్పి ప్రశాంత్ కి మాట లేకుండా చేశాడు. దీంతో ప్రశాంత్ తెల్లమొహం వేసాడు.

నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో పాము నిచ్చెన గేమ్ ఆడించాడు నాగార్జున. కంటెస్టెంట్స్ అంతా హౌస్ లో ఉన్నవాళ్లలో మీకు ఎవరు నిచ్చెనలా సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు పాములా తొక్కేస్తున్నారు చెప్పాలి అని తెలిపాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా హౌస్ లో తమకి పాములా ఎవరున్నారు, నిచ్చెనలా ఎవరు ఉన్నారు అని చెప్పారు.

మొదట అశ్విని.. గౌతమ్ నిచ్చెన అని, శోభాశెట్టి పాము అని చెప్పింది. గౌతమ్.. అర్జున్ నిచ్చెన అని, శివాజీ పాము అని చెప్పాడు. శివాజీ.. యావర్ నిచ్చెన అని, అమర్ దీప్ పాము అని చెప్పాడు. అర్జున్.. గౌతమ్ నిచ్చెన అని, శివాజీ పాము అని చెప్పాడు. అమర్ దీప్.. అర్జున్ నిచ్చెన అని, తేజ పాము అని చెప్పాడు. యావర్.. శివాజీ నిచ్చెన అని, గౌతమ్ పాము అని చెప్పాడు. పూజా.. అర్జున్ నిచ్చెన అని, అశ్విని పాము అని చెప్పింది. ప్రియాంక.. శోభాశెట్టి నిచ్చెన అని, అశ్విని పాము అని చెప్పింది. భోలే.. శివాజీ నిచ్చెన అని, శోభాశెట్టి పాము అని చెప్పింది. శోభాశెట్టి.. ప్రియనక నిచ్చెన అని, భోలే పాము అని చెప్పింది. సందీప్.. శోభాశెట్టి నిచ్చెన అని, శివాజీ పాము అని చెప్పాడు. తేజ.. అమర్ దీప్ నిచ్చెన అని, యావర్ పాము అని చెప్పాడు. ప్రశాంత్.. శివాజీ నిచ్చెన అని, పూజా పాము అని చెప్పాడు. ఈ గేమ్ తో మరోసారి కంటెస్టెంట్స్ మధ్య విబేధాలు వచ్చాయి.

Also Read : Bigg Boss 7 : అమ‌ర్ ఎంత పెద్ద స‌మస్య‌లో ఇరుక్కున్నాడో తెలుసా..?

ఇక చివరగా శివాజీ మళ్ళీ వెళ్లిపోతానని రాగం అందుకున్నాడు. ఈ సారి డైరెక్ట్ గా నాగార్జునతో చెప్పాడు.. నాకు ఆరోగ్యం సహకరించట్లేదు, నా వల్ల కావట్లేదు అని చెప్పగా.. చూద్దాం, ప్రస్తుతానికి ఫిజియోని పంపిస్తాను అని చెప్పాడు నాగార్జున. మరి శివాజీ ఉంటాడా, వెళ్ళిపోతాడా చూడాలి. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో నేటి ఎపిసోడ్ లో చూడాలి.