Mokshagna : మోక్షజ్ఞతో సినిమా తీసేందుకు తేజశ్విని, బ్రాహ్మణి పోటాపోటీ..?

నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రంపై చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది.

Mokshagna : మోక్షజ్ఞతో సినిమా తీసేందుకు తేజశ్విని, బ్రాహ్మణి పోటాపోటీ..?

Tejashwini and Brahmani compete to make a film with Mokshagna Teja

Mokshagna : నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రంపై చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌కు వెళ్లిన బాలయ్య సైతం త్వరలో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలో మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ వస్తుందని టాలీవుడ్‌ టాక్‌. ఐతే మోక్షజ్ఞ ఎంట్రీపై ఫ్యామిలీలోనే ఓ కన్ఫ్యూజన్‌ ఉందట.. మోక్షజ్ఞ న‌టించే సినిమాకు నిర్మాతగా ఎవరు ఉండాలన్నదే తేల్చుకోలేకపోతోందట నందమూరి కుటుంబం..

తెలుగు సినీ ఇండస్ట్రీతో నందమూరి కుటుంబానికి దశాబ్దాల అనుబంధం. మహానటుడు ఎన్టీఆర్‌ నటవారసత్వం అందిపుచ్చుకుని ఆయన కుటుంబంలో ఎందరో స్టార్‌ హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇప్పుడు మరో హీరో ఎంట్రీకి కూడా రంగం సిద్ధమైంది. నందమూరి నటసింహం బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సిని ఎంట్రీకి అంతా రెడీ అయింది. త్వరలో సెట్స్‌పైకి వచ్చే మోక్షజ్ఞ సినిమా కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయంటున్నారు. అయితే మోక్షజ్ఞతో సినిమా చేసే విషయంలో బాలయ్య ఇద్దరు కుమార్తెలు పోటీ పడుతున్నారని టాక్‌. తమ ముద్దుల తమ్ముడి మొదటి సినిమా నిర్మాత బాధ్యతలు తనకి కావాలంటే తనకు కావాలని బాలయ్య ఇద్దరు బిడ్డలు బ్రాహ్మణి, తేజశ్వని పోటీపడుతున్నారనే టాక్‌ వినిపిస్తోంది.

Chiranjeevi : అంద‌రికి చెప్పండి.. మార్పు తీసుకురండి.. ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌దే : చిరంజీవి

బాలయ్య పిల్లల్లో చిన్నకుమార్తె తేజశ్వనికి మాత్రమే ప్రస్తుతం సినీ రంగంతో అనుబంధం ఉంది. బాలయ్య సినిమా వ్యవహారాలను తేజశ్వని పర్యవేక్షిస్తుంటారు. దీంతో తమ్ముడు మోక్షజ్ఞ సినిమాను తాను నిర్మిస్తానని ముందుకొచ్చారట తేజశ్వని. ఐతే ఆ అవకాశం తనకే ఇవ్వాలని బాలయ్య పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి పట్టుబడుతున్నారని తెలుస్తోంది. తన గారాల తమ్ముడి తొలి సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారట బ్రాహ్మణి. ప్రస్తుతం హెరిటేజ్‌ కంపెనీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న బ్రాహ్మణి సినీ నిర్మాతగా మారతానంటుండటం, ఇంకో కుమార్తె కూడా నిర్మాణానికి ఆసక్తి చూపుతుండటంతో ఏమీ తేల్చుకోలేకపోతున్నారట బాలయ్య.

ఇద్దరు అక్కలు.. తమ తమ్ముడి కోసం నిర్మాతగా మారతామంటుండటంతో.. అంతా బాలయ్య నిర్ణయం కోసం వేచిచూస్తున్నారట. ప్రస్తుతానికి కథా చర్చలు, డైరెక్టర్‌ ఎంపికపై ఫోకస్‌ చేసిన బాలయ్య.. నిర్మాణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయమై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీపై అందరినీ అటెన్షన్‌లో పెట్టారు బాలయ్య.

Actor Ali : వైసీపీకి న‌టుడు అలీ రాజీనామా.. ఇక‌పై నా దారి ఇదే..