Navdeep : నవదీప్ కాలికి గాయం.. తేజస్వి వీడియో పోస్ట్.. చూస్తే నవ్వాల్సిందే..

హీరో నవదీప్ కాలికి గాయం అయ్యింది. ఆ విషయాన్ని తెలియజేస్తూ టాలీవుడ్ నటి తేజస్వి పోస్ట్ చేసిన ఒక వీడియో చూస్తే కచ్చితంగా నవ్వాల్సిందే.

Navdeep : నవదీప్ కాలికి గాయం.. తేజస్వి వీడియో పోస్ట్.. చూస్తే నవ్వాల్సిందే..

Tejaswi Madivada video post on Navdeep leg fracture

Updated On : July 6, 2023 / 9:34 PM IST

Navdeep : టాలీవుడ్ హీరో నవదీప్ ఒక పక్క హీరోగా చేస్తూనే సపోర్టింగ్ రోల్స్ కూడా కనిపిస్తూ అలరిస్తున్నాడు. ఈ హీరో నటిస్తున్న పలు సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ‘న్యూసెన్స్’ (Newsense) అనే వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సిరీస్ ఆహాలో ప్రసారం అవుతుంది. ఇది ఇలా ఉంటే, నవదీప్ కాలికి అయ్యింది.

Salaar : రికార్డు క్రియేట్ చేసిన సలార్ టీజర్.. ఏ విషయంలో తెలుసా..?

అందుకు సంబంధించిన వీడియోని టాలీవుడ్ నటి తేజస్వి (Tejaswi Madivada) పోస్ట్ చేసింది. ఆ వీడియోలో నవదీప్ కాలికి కట్టుతో కూర్చుంటే.. తేజస్వి అతని ముందు “నీ సుఖమే నేను కోరుకున్నా” అనే సాంగ్ కి డాన్స్ వేస్తూ కనిపిస్తుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్ ఫన్నీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది అసలు ఏమైందని అని ఆరా తీస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)

Naresh : ఆత్మరక్షణ కోసం తుపాకీ లైసన్స్‌ కావాలంటూ ఎస్పీని కలిసిన నరేశ్‌..

కాగా తేజస్వి కూడా ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ‘అర్థమైందా..? అరుణ్ కుమార్’ (Arthamainda Arun Kumar) అనే సిరీస్ లో హాట్ లేడీ బాస్ గా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఇటీవలే ఆహా రిలీజ్ అయిన ఈ సిరీస్ సక్సెస్ ఫుల్ గా స్ట్రీమ్ అవుతుంది. సాఫ్ట్ వెర్ ఇండస్ట్రీలో ఇంటర్న్ గా ఉండే వారి ప్రాబ్లెమ్స్ ని ఎంటర్‌టైనింగ్ చూపించి ఆడియన్స్ ని అలరించారు. ఇక నవదీప్ న్యూసెన్స్ విషయానికి వస్తే.. జర్నలిస్ట్, మీడియా, ఫేక్ న్యూస్.. వంటి అంశాలు చుట్టూ కథ నడుస్తుంది. నవదీప్ తో పాటు బిందు మాధవి ప్రధాన పాత్రలో కనిపించింది.