ఐబొమ్మ రవి కొత్త బిజినెస్ ప్లాన్.. పోలీసులు జాబ్ ఆఫర్ చేస్తే రిజెక్ట్?.. తనకు వేరే ప్లాన్ చెప్పిన రవి..

గత కొన్ని రోజులుగా పోలీసులు ఐ బొమ్మ రవిని రిమాండ్ లోకి తీసుకొని విచారిస్తున్నారు. (I Bomma Ravi)

ఐబొమ్మ రవి కొత్త బిజినెస్ ప్లాన్.. పోలీసులు జాబ్ ఆఫర్ చేస్తే రిజెక్ట్?.. తనకు వేరే ప్లాన్ చెప్పిన రవి..

I Bomma Ravi

Updated On : December 3, 2025 / 1:12 PM IST

I Bomma Ravi : కొత్త సినిమాలను పైరసీ చేసి ఐ బొమ్మ వెబ్ సైట్ లో పెట్టి సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టం కలిగేలా చేసాడు రవి. పైగా ఐ బొమ్మకు వచ్చే యూజర్స్ ని బెట్టింగ్ యాప్స్ కి తరలించడం, డబ్బుని హవాలా చేయడం, యూజర్స్ డేటాని డార్క్ వెబ్ కి అమ్మాలనుకోవడం లాంటి ఇల్లీగల్ పనులు కూడా చేసాడు. నన్నెవరూ ఏం చేయలేరు అని ధీమాతో ఛాలెంజ్ చేసిన ఐ బొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో కూర్చోపెట్టారు.(I Bomma Ravi)

గత కొన్ని రోజులుగా పోలీసులు ఐ బొమ్మ రవిని రిమాండ్ లోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటికే ఐ బొమ్మ వెబ్ సైట్ కూడా క్లోజ్ అయిపొయింది. అయితే తాజాగా ఐ బొమ్మ రవి ట్యాలెంట్ చూసి పోలీసులు ఓ ఆఫర్ ఇచ్చారట.

Also Read : Jabardasth Praveen : జబర్దస్త్ లో ఆమెకు ప్రపోజ్ చేసిన ప్రవీణ్.. నాకు ఎవరూ లేరు అమ్మలా చూసుకుంటా.. ఈ నటి ఎవరో తెలుసా?

ఐ బొమ్మ రవి తెలివితేటలు గమనించిన పోలీసులు.. పోలీసు శాఖలోకి వచ్చి, సైబర్ క్రైమ్ విభాగంలో పని చేస్తావా? మంచి జీతం ఇస్తాం అని ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే రవి మాత్రం వారి ఆఫర్ ను తిరస్కరించినట్లు సమాచారం. దీంతో మరి ఐ బొమ్మ క్లోజ్ అయింది. తర్వాత ఏంటి అని పోలీసులు ప్రశ్నించారు.

దీనికి ఐ బొమ్మ రవి.. కరేబియన్ దీవుల్లోనే ఒక రెస్టారెంట్ పెట్టి తెలంగాణ, ఆంధ్రాతో పాటు దేశంలోని ప్రముఖ వంటకాలను అక్కడి ప్రజలకు రుచి చూపించి డబ్బు సంపాదిస్తాను. రెస్టారెంట్ కి ఐ బొమ్మ పేరే పెడతాను. కరేబియన్ దీవుల్లోని అన్ని దేశాల్లో ఐ బొమ్మ రెస్టారెంట్ శాఖలను ఏర్పాటు చేసి భారత వంటకాలకు అక్కడి ప్రజలు అలవాటు పడేలా చేస్తానని రవి తెలిపినట్టు సమాచారం.

Also Read : Actress Hema : ఆ సమయంలో చిరంజీవి గారి సపోర్ట్.. వాళ్ళ మనిషిని పంపించి.. ఆ హీరో దగ్గర ఏడ్చేశాను..

అలాగే ఐ బొమ్మ రెస్టారెంట్ లతో వచ్చే డబ్బుతో జీవితాన్ని ఎంజాయ్ చేయడమే నా లక్ష్యమని రవి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే రవి లక్ష డాలర్లు అంటే దాదాపు 80 లక్షలు ఖర్చుపెట్టి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వాన్ని రవి తీసుకున్నాడు. ఇప్పటి వరకు రవి 20 కోట్లు సంపాదిస్తే అందులో 17 కోట్లు ఎంజాయ్ చేయడానికే ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇకపై కూడా తను అలాగే బతుకుతూ వారానికో దేశం తిరుగుతూ ఎంజాయ్ చేస్తానని రవి విచారణలో చెప్పినట్టు తెలిసింది.