రచయిత జొన్నవిత్తులపై అట్రాసిటీ కేసు

  • Published By: vamsi ,Published On : June 2, 2020 / 03:58 AM IST
రచయిత జొన్నవిత్తులపై అట్రాసిటీ కేసు

Updated On : June 2, 2020 / 3:58 AM IST

ప్రముఖ తెలుగు కవి, గేయ రచయిత.. సుమారు 600కి పైగా పాటలు రాసిన తెలుగు అధికార భాషా సంఘ మాజీ సభ్యుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుపై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. షెడ్యూల్డ్ కులం మరియు షెడ్యూల్డ్ తెగ చట్టం యొక్క సెక్షన్ 3 (1) మరియు 7 (1) (డి) పౌర హక్కుల నిరోధక చట్టం కింద ఆయనపై కేసు నమోదు అయ్యింది.

మార్చి 23వ తేదీన ఓ టీవీ చానల్ కార్యక్రమంలో పాల్గొన్న జొన్నవిత్తుల ఎస్సీ, ఎస్టీల మనోభావాలు కించపరిచేలా ఓ పద్యం పాడారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. అంటరానితనాన్ని కొనసాగించే అర్థం ఆ పద్యంలో ఉందంటూ మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పేరడీ పాటలు రాయడంలో, పాడడంలో ప్రసిద్ధుడు అయిన జొన్నవిత్తుల పాడిన పద్యాన్ని ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజునే ఓ యూట్యూబ్ చానెల్‌లో అప్‌లోడ్ చేసినట్టుగా ఆయన ఫిర్యాదులో వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు న్యాయ నిపుణుల సలహాల అనంతరం చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు.

Read: జూనియర్ ఎన్టీఆర్, నారా బ్రహ్మిణీపై బాలయ్య ఒకటే మాట!